Valayam 2020 Telugu Movie Review

Valayam

వలయం మూవీ రివ్యూ – Valayam Movie Review




లక్ష్ చదలవాడ, దిగంగన సూర్యవంశీ జంటగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంలో రమేష్ కదుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వలయం. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది. మరి వలయం మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం…

కథ :

అరవింద్(లక్ష్) దిశా(దిగంగన) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. సాఫీగా సాగిపోతున్న అరవింద్ జీవితంలో భార్య దిశా కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. అసలు దిశా ఏమైంది? తనకు తానే వెళ్లిపోయిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా? దిశా మిస్సింగ్ మిస్టరీలో భర్త అరవింద్ పాత్ర ఏమైనా ఉందా? చివరికి లక్ష్ దిశాను చేరుకున్నాడా.. లేదా? అనేది తెరపైన చూడాలి.




ప్లస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్ పై వచ్చే పెళ్లి చూపులకు సంబంధినచిన ఓపెనింగ్ సన్నివేశం కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే పెళ్లి, హనీమూన్ కి సంబంధించి భార్య భర్తలు లక్ష్, దిగంగనలపై నడిచే మొదటి మెలోడీ సాంగ్ చాలా బాగుంది.

హీరో లక్ష్ నటనపరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోయినా సినిమా ఆద్యంతం అన్నీ తానై నడిపించాడు. ఇక హీరోయిన్ దిగంగన పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైనా, ఉన్నంతలో చక్కని నటన కనబరిచారు.

పోలీస్ అధికారిగా హీరోతో సమానమైన పాత్ర దక్కించున్న రవి ప్రకాష్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ఇక విలన్ పాత్రలు చేసిన నోయల్, కిరీటి, రవి ప్రకాష్ అసిస్టెంట్ గా చేసిన చిత్రం శ్రీనుల నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఎప్పుడైనా వేగంతో కూడిన పట్టు సడలని స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు మాత్రమే క్రైమ్ థ్రిల్లర్స్ ఆకట్టుకుంటాయి. వలయం సినిమాకి అదే పెద్ద మైనస్. స్లోగా ఏమాత్రం ఆసక్తికలిగించని స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు కొంచెం కూడా థ్రిల్ కలిగించలేక పోయింది.
సినిమా మొదలైన కొద్దిసేపటికే హీరోయిన్ మిస్ అవుతుంది. దీనితో ప్రేక్షకులకు ఏమాత్రం గ్లామర్ రసం దొరకదు. ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ హీరోయిన్ కి అసలు పాత్ర లేకుండా పోయింది.

సినిమా మొత్తం హీరో లక్ష్, పోలీస్ పాత్ర చేసిన రవి ప్రకాష్ మీద నడిపించేశారు. పోలీస్ అసిస్టెంట్ గా చేసిన చిత్రం శ్రీనుతో నైనా కొంచెం ఫన్ జెనరేట్ చెయ్యాల్సింది. వలయం లో అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా పెద్ద మైనస్.

కనిపించకుండా పోయిన భార్య కోసం భర్త తీవ్రంగా వెతుకుతున్నాడు అంటే, వాళ్ళ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేలా సన్నివేశాలు తెరకెక్కించాలి. కానీ లక్ష్, దిగంగన మధ్య అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించదు. దానితో కంటెంట్ ఎమోషనల్ గా కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు.




సాంకేతిక విభాగం :

ఈ మూవీలో చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే అది శేఖర్ చంద్ర స్వరపరిచిన నిన్ను చూశాకే..రొమాంటిక్ సాంగ్. సినిమాలో ఉన్న ఈ ఒక్కగానొక్క సాంగ్ ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ పరవాలేదు. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు జస్ట్ ఒకే అన్నట్లుగా ఉన్నాయి.

సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ కి స్లో నెరేషన్ తో సాగే బోరింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు. మిస్సింగ్ మిస్టరీ ఛేదించడం అనేది ఎన్నో సినిమాలో వచ్చిందే అయితే దానికి సరికొత్త స్క్రీన్ ప్లే, సన్నివేశాలు రాసుకున్నపుడే అది ప్రేక్షకులకు కొత్తగా తోస్తుంది. ఆ విషయంలో రమేష్ పూర్తిగా విఫలం చెందారు.

తీర్పు :

సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన వలయం ప్రేక్షకులకు ఏమాత్రం అనుభూతి పంచదు. ఆసక్తిరేపని స్క్రీన్ ప్లే, స్లో నెరేషన్, బలహీనమైన సన్నివేశాలు సినిమాను ఆసక్తిగా మలచడంలో విఫలం చెందాయి. ఫస్ట్ హాఫ్ లో మొదటి పది నిముషాలలో వచ్చే సన్నివేశాలు, ఫస్ట్ సాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం ఆహ్లాదం పంచే అంశాలు. అంతకు మించి వలయం మూవీలో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

English Review