Ugram 2023 Telugu Movie Review

Ugram

ఉగ్రం మూవీ రివ్యూ – Ugram Movie Review

అల్లరి నరేష్ హీరోగా మిర్న హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ఉగ్రం. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




సిఐ శివ కుమార్ (అల్లరి నరేశ్) సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మిస్ అయిన తన భార్య (మిర్నా) మరియు తన కూతురు కోసం సీరియస్ గా వెతుకుతూ ఉంటాడు. అసలు సిఐ శివ కుమార్ భార్య, కూతురు ఎలా మిస్ అయ్యారు ?, అలాగే సిటీలో మిస్ అయిన వందలాదిమంది ప్రజలు ఏమైపోయారు ?, ఈ మిస్సింగ్ కేసులు వెనుక ఎవరు ఉన్నారు ?, చివరకు సిఐ శివ కుమార్ ఈ మిస్సింగ్ కేసులను ఎలా సాల్వ్ చేశాడు ? తన భార్య కూతుర్ని ఎలా సేవ్ చేసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సాధారణ ప్రజలు మిస్ అయితే.. పోలీసులు దైర్యాన్ని ఇస్తారు. కానీ, పోలీస్ భార్యపిల్లలే మిస్ అయితే.. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?, ఒక పోలీస్ ఫ్యామిలీ సమస్యలో ఉంటే.. తనను తన ఫ్యామిలీని అలాగే మిస్ అయిన మిగిలిన ప్రజలను ఆ పోలీస్ ఎలా సేవ్ చేసుకున్నాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ ఉగ్రం సినిమా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. తన పరిపక్వతమైన నటనతో అల్లరి నరేశ్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన శత్రు కూడా చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన మిర్నా తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించింది. మెయిన్ గా హీరో – ఇజ్రాల గెటప్స్ లో ఉన్న విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు పర్వాలేదు. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజ కూడా బాగానే నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి నటన బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :




విజయ్ కనకమేడల దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్ ఉన్నా గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని విచారణ డ్రామాతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. దీనికి తోడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. అలాగే కథ పరంగా వచ్చే కొన్ని కీలక సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అయితే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ రాసుకోవడం బాగుంది.

 సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

ఉగ్రం అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఐతే, కథనంలో కొన్ని చోట్ల ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, అలాగే ప్లే బోర్ గా సాగడం, కొన్ని సీక్వెన్స్ లో లాజిక్స్ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు.

English Review