The Ghost 2022 Telugu Movie Review

ది ఘోస్ట్ మూవీ రివ్యూ – The Ghost Movie Review

కింగ్ నాగార్జున తన ప్రయోగాత్మకమైన, ప్రత్యేకమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌కి కొత్త తరహా చిత్రాలను తీసుకురావడానికి అతను ఎల్లప్పుడూ తన బెస్ట్‌ను అందజేస్తాడు. ఈసారి లేటెస్ట్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ కోసం స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారుతో చేతులు కలిపాడు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.

కథ :




విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి దుబాయ్‌ లో పనిచేస్తాడు. అతని ప్రొఫెషనల్ లైఫ్ సవ్యంగా సాగుతున్నప్పుడు, ఒక సంఘటన విక్రమ్‌ని మానసికంగా కలవరపెడుతుంది. మరియు తన ప్రియురాలు ప్రియను విడిచిపెట్టేలా చేస్తుంది. ఒక మంచి రోజు అతను అను (గుల్ పనాగ్) నుండి తన కుమార్తె అదితి మరియు ఆమె జీవితం పట్ల తనకున్న ఆందోళనను తెలియజేస్తూ, సమస్యను పరిష్కరించమని విక్రమ్‌ని అడగడం జరుగుతుంది. ఈ అను ఎవరు? ఆమె విక్రమ్ సహాయం ఎందుకు కోరింది? అను, అదితికి ముప్పు ఎవరు? అనుకు విక్రమ్‌కి ఉన్న అనుబంధం ఏమిటి? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

వైవిధ్యమైన పాత్రలు చేయడానికి వెనుకాడని అతి కొద్ది మంది నటుల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఈ విషయాన్ని తన కెరీర్‌లో చాలాసార్లు నిరూపించుకున్నాడు. ది ఘోస్ట్‌తో, నటుడు మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. విక్రమ్‌గా అతని నటన ఈ చిత్రం యొక్క అతిపెద్ద ఆస్తులలో ఒకటి. కింగ్ నాగ్ ఈ సినిమాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన భుజాలపై మోశాడు.

ఈ చిత్రంలో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఇటీవలి కాలంలో అత్యుత్తమమైనవి అని చెప్పాలి. ఈ యాక్షన్ సీక్వెన్స్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. మరియు అవి గూస్‌బంప్స్ మూమెంట్స్ ఇస్తాయి. అలాంటి రిస్కీ స్టంట్స్‌ని కన్విన్సింగ్‌గా చేసినందుకు నాగార్జునను మెచ్చుకోకుండా ఉండలేం. ఈ చిత్రం పూర్తిగా అలాంటి అనేక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఇది మనల్ని స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేస్తుంది.

సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ ఎలిమెంట్‌కే పరిమితం కాకుండా చాలా చక్కని నటనని కనబరిచింది. ఆమె పాత్రకు ఈ సినిమా లో మంచి స్కోప్ ఉంది. ఆమె సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ యాక్షన్ పార్ట్‌లో క్లియర్ గా కనిపిస్తాయి. అనికా సురేంద్రన్, గుల్ పనాగ్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి మిగతా నటీనటులు తమ వంతు పాత్రలకి న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :




ఈ చిత్రం యాక్షన్ పార్ట్‌తో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, డ్రామా మరియు కథ అంత గొప్పగా లేవు. మరియు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కథ అంత డెప్త్ గా ఉండదు. ఎమోషనల్ యాంగిల్ ఆర్టిఫీషియల్ గా, కొంచెం బలవంతంగా కనిపిస్తుంది. ఇది మనల్ని సినిమాకి పూర్తిగా కనెక్ట్ చేయదు అని చెప్పాలి.

ది ఘోస్ట్‌లో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా హీరో నాగ్ అన్ని తుపాకీలతో దూసుకు పోతున్నప్పుడు ఘనమైన విలన్ పాత్ర సినిమాకి చాలా అవసరం. కానీ, ఇక్కడ అలా జరగలేదు. కాబట్టి పెద్దగా కష్టపడకుండానే హీరో పని అయిపోతుందన్న ఫీలింగ్ మన అందరిలో కలుగుతుంది.

చివరి గంటలో ఒక పాయింట్ తర్వాత కథ ఊహించదగినదిగా ఉంటుంది మరియు దాని నుండి స్క్రీన్‌ప్లే ప్రోసీడింగ్‌లు అంత ఆసక్తికరంగా సాగవు. మధ్యలో కొన్ని సన్నివేశాలు మనసులను కదిలించే విధంగా ఉంటాయి. కానీ, వాటిని పెట్టిన విధానం పెద్దగా విలువను జోడించలేదు అని చెప్పాలి.

♦ ట్రైలర్ : ది ఘోస్ట్ – నాగార్జున, సోనాల్ – 05/10/2022 – The Ghost Trailer – Nagarjuna, Sonal

సాంకేతిక విభాగం :

భరత్ – సౌరభ్ లు అందించిన పాటలు బాగున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కొన్ని యాక్షన్ బ్లాక్‌లలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్సుకతను పెంచడం మాత్రమే కాకుండా, ఎక్కువ విలువను జోడించింది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ గా ఉంది. కొన్ని ఫ్రేమ్‌లు హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉన్నాయి. మరియు అతని పని ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు భారీ డెప్త్ ను జోడించింది అని చెప్పాలి.

నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. మరియు ఈ చిత్రం స్క్రీన్ పై మరింత అందంగా కనపడటానికి చాలా ఖర్చు చేశారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగా యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు సినిమా కి ప్రధాన ఆస్తులు. మరియు ఆడ్రినలిన్ రష్ మూమెంట్‌లను ఇవ్వడంతో పాటు అవసరమైన డెప్త్ ను ఇచ్చారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే, అతను ది ఘోస్ట్‌తో కొంతవరకు విజయం సాధించాడు. అతను యాక్షన్ సన్నివేశాలను హ్యాండిల్ చేయడంలో అద్భుతంగా ఉండగా, కోర్ ఎమోషనల్ పార్ట్ పై కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. అతను ఈ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే, విషయాలు చాలా మెరుగ్గా ఉండేవి. అలాగే, అతని కథనం తరువాతి గంటలో అంతగా ఆకట్టుకోదు, ఇది సినిమాపై కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది.

తీర్పు :

మొత్తం మీద, ది ఘోస్ట్ పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్. కొన్ని ప్రపంచ స్థాయి పోరాట సన్నివేశాల ద్వారా నాగార్జున అద్భుతమైన నటనను కనబరిచారు. ఇవి సినిమాకి బలం అని చెప్పాలి. మరోవైపు, సరైన భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం, బలహీనమైన విలన్, ముందుగానే తెలిసిపోయే విధంగా కథ సాగుతూ ఉండటం వంటి అంశాలు నిరాశను కలిగిస్తాయి. మీరు యాక్షన్ చిత్రాలను ఇష్ట పడేవారు అయితే సినిమాను చూడవచ్చు. మీ అంచనాలను తగ్గించుకొని వెళితే ఎంజాయ్ చేయవచ్చు.

English Review