Tegimpu 2023 Telugu Movie Review

Tegimpu

తెగింపు మూవీ రివ్యూ –  Tegimpu Movie Review

అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘తునివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’గా అనువాదమైంది. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

కథ :




వైజాగ్ లోని యువర్ బ్యాంక్ లోని డబ్బును దోచుకోవడానికి రెండు గ్యాంగ్ లు వస్తాయి. అందులో ఒక గ్యాంగ్ కి చీఫ్ డార్క్‌డెవిల్ (అజిత్ కుమార్). కన్మణి (మంజు వారియర్)తో కలిసి అజిత్ యువర్ బ్యాంక్ పై ఈ దోపిడీ ప్లాన్ చేస్తాడు. అయితే, అప్పటికే మూడో గ్యాంగ్ యువర్ బ్యాంక్ లో ఉంటుంది. అసలు ఈ మూడో గ్యాంగ్ ఎవరిది ?, అలాగే రెండో గ్యాంగ్ ను సెట్ చేసింది ఎవరు ?, ఇంతకీ డార్క్ డెవిల్ గా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న‌ అజిత్ కుమార్ ఎందుకు ఈ యువర్ బ్యాంక్ ను మాత్రమే టార్గెట్ చేశాడు ?, గతంలో ప్రజల నుంచి ఈ యువర్ బ్యాంక్ దోచుకున్న 2500 కోట్లను అజిత్ గ్యాంగ్ చివరకు ఎలా పట్టుకున్నారు?, ఆ భారీ మొత్తాన్ని మోసగింపబడ్డ ప్రజలకు ఎలా చేరవేశాడు?, ఈ మొత్తం కథలో అజిత్ చేసిన యాక్షన్ విన్యాసాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అజిత్ కుమార్ గత చిత్రాలు కంటే భిన్నంగా వచ్చిన ఈ యాక్షన్ మైండ్ గేమ్ థ్రిల్లర్ తెగింపులో కొన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పైగా గుడ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ కుమార్ తన స్టైలిష్ లుక్స్ తో అండ్ తన గ్రేస్ యాక్షన్ తో అదరగొట్టాడు. అన్నిటికీ మించి అజిత్ ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా డార్క్ డెవిల్ గా అజిత్ కుమార్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

ఇక బ్యాంక్ లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో వచ్చే సముద్రపు చేజ్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు హెచ్.వినోద్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. మంజు వారియర్ కూడా చాలా బాగా నటించింది. అలాగే కమీషనర్ గా సముద్రఖని, మరియు జాన్ కొక్కెన్, భగవతి పెరుమాళ్, అజయ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మొత్తమ్మీద ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో బ్యాంక్ ల్లో జరిగే దోపిడీకి సంబంధించిన సీన్స్ తో మరియు థ్రిల్లింగ్ ప్లే ఈ సినిమా యాక్షన్ లవర్స్ ను మెప్పిస్తుంది. మెయిన్ గా సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలలో దర్శకుడు వినోద్ హార్డ్ వర్క్ బాగుంది. అలాగే సినిమాలో ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :




సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ చాలా బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా మూవీలా.. లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక బ్యాంక్ లు చేసే దోపిడీకి సంబంధించి.. ఈ సినిమాలో చూపించినట్లు మరీ అంతదారుణమైన పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో ఉన్నాయా అనేది అనుమానమే.

అయితే, సినిమాలో మంచి సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాలా చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ అంతా స్పీడుగా ఎంటర్ టైన్ గా సెకెండ్ హాఫ్ ఉండదు. హీరోయిన్ మంజు వారియర్ పాత్ర కూడా బలంగా అనిపించదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు హెచ్ వినోద్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ బావుంది గానీ, సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సంగీతం విషయానికి వస్తే.. నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

గుడ్ మెసేజ్ తో యాక్షన్ ఫీస్ట్‌ గా వచ్చిన ఈ తెగింపు లో అజిత్ కుమార్ తన స్టైలిష్ యాక్టింగ్ తో అండ్ తన సూపర్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే, ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో అజిత్ నటన, యాక్షన్ ఎలిమెంట్స్, భారీ వైల్డ్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

English Review