Shivan 2020 Telugu Movie Review





Shivan

శివన్ మూవీ రివ్యూ – Shivan Movie Review

కల్వకోట సాయితేజ – తరుణీ సింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. సంతోష్ రెడ్డి లింగాల నిర్మించిన లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. మరి ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.




కథ :

శివన్ (కల్వకోట సాయితేజ) చిన్నప్పుడే తన తల్లిని కోల్పోతాడు. దాంతో అతనికి సునంద (తరుణీ సింగ్) దగ్గరవుతుంది. వాళ్లతో పాటు వాళ్ళ ప్రేమ కూడా పెరుగుతూ వస్తోంది. అల హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్ లో ఒక యాక్సిడెంట్ సునందను అనాథను చేస్తోంది. దాంతో శివన్, సునంద బాధను పోగొట్టడానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా పెళ్లి కోసం బయలుదేరతారు. దారిలో ఉన్నట్టు ఉండి శివన్ ఒక్కసారిగా మారిపోయి.. సునందను దారుణంగా చంపేస్తాడు. అంతగా ప్రేమించినవాడు ఎందుకు ఆమెను చంపాడు ? ఒక్కసారిగా అతనికి ఏమైంది ? చంపింది అతనే ఆయన.. అతనికి తెలియకుండానే ఏదో శక్తి అతని చేత ఈ పని చేయించిందా ? ఇంతకీ ఆ శక్తి ఏమిటి ? చివరికీ శివన్, సునంద కోసం ఎలా మారిపోతాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. హీరోగా నటించిన సాయితేజ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన తరుణీ సింగ్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు.

అలాగే హీరో ఫ్రెండ్ మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు శివన్ తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం కూడా పర్వాలేదు.




మైనస్ పాయింట్స్ :

ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతోంది. సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక దర్శకుడు శివన్ మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు బాగా బోర్ గా సాగుతాయి.

తీర్పు :

‘శివన్’ అంటూ న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోదు.

English Review