Rules Ranjan (2023) Telugu Movie Review

Rules Ranjan

రూల్స్ రంజన్ మూవీ రివ్యూ

చిత్రం : రూల్స్ రంజన్
తారాగణం : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది
రచన & దర్శకత్వం: రత్నం కృష్ణ
నిర్మాతలు: దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
సంగీతం: అమ్రిష్
బ్యానర్: స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సమర్పణ: A.M. రత్నం
సహ నిర్మాత – రింఖు కుక్రేజా
కొరియోగ్రఫీ – శిరీష్ కుమార్
విడుదల తేదీ : 6 అక్టోబర్ 2023

కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన చిత్రం “రూల్స్ రంజన్”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కిరణ్ అబ్బవరం (మనో రంజన్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తన సీరియస్ నెస్ కారణంగా ఆ కంపెనీలో అందరూ అతన్ని రూల్స్ రంజన్ అని పిలుస్తూ ఉంటారు.ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సనా (నేహా శెట్టి) రంజన్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. గతంలో కాలేజీ రోజుల్లో రంజన్ ఆమెను ప్రేమిస్తాడు.

మళ్లీ నాలుగేళ్ల తర్వాత సడెన్ గా ఆమె కనిపించే సరికి రంజన్ మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి సనా, రంజన్ ను తిరిగి ప్రేమిస్తోందా ?, లేదా ?, ఒకవేళ  ప్రేమిస్తే చివరకు వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా? లేదా ? అనేది మిగిలిన కథ.

 ప్లస్ పాయింట్స్ :

లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగానే ఉంది. అలాగే, ఇక ఈ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం సినిమాలోని తన పాత్రకు తగ్గట్లు లుక్స్ పరంగా అలాగే నటన పరంగా కూడా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అదే విధంగా హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో నేహా శెట్టి బాగానే మెప్పించింది.

హీరోకు స్నేహితులుగా నటించిన హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన మెహర్ చాహల్ నటించడానికి బాగానే తాపత్రయ పడింది. వెన్నెల కిశోర్, సుబ్బరాజు, అజయ్, మకరంద్ దేశ్‌పాండే, గోపరాజు రమణ లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. సినిమాలో అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రథినం కృష్ణ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. మెయిన్ కథలో స్ట్రాంగ్ కంటెంట్ మిస్ అయ్యింది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత డెప్త్ గా చూపిస్తే బాగుండేది. చాలా సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో ముంబై నేపథ్యంలో జరిగే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు.

కథనంలో కూడా చాలా లోపాలు కనిపిస్తాయి. కాలేజీ లైఫ్ లో జరిగిన లవ్ డ్రామా కూడా కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. పైగా కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది.

ఇక కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. మొత్తమ్మీద స్టోరీగా తీసుకున్న స్లాట్ బాగున్నప్పటకీ కథనం అంతా పాతదే కావడంతో తదుపరి వచ్చే సీన్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి, అలానే ఎటువంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు వంటివి కూడా ఈ రూల్స్ రంజన్ మూవీలో మిస్ అయ్యాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో పని చేసిన వారి పనితీరు బాగానే ఉంది. సినిమాలోని ప్రతి సీన్ ని విజువల్ గా ఎంతో అందంగా చూపించారు దులీప్ కుమార్ ఎం.ఎస్. అమ్రిష్ గణేష్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. అలానే నిర్మాతలు నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు రథినం కృష్ణ ఈ మూవీని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేకపోయారు.

తీర్పు :

ఓవరాల్ గా ఈ ‘రూల్స్ రంజన్’ కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, అలాగే ఫేక్ ఎమోషన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాలో కిరణ్ అబ్బవరం- నేహా శెట్టి నటన మాత్రం బాగుంది. కానీ, సినిమా మాత్రం నిరాశ పరిచింది.

English Review