Ravanasura 2023 Telugu Movie Review

Ravanasura

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు తన మరో చిత్రం “రావణాసుర” తో ఈ వారం థియేటర్స్ లోకి వచ్చేసారు. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ థ్రిల్లర్ గా ఈరోజు రాగా మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :




ఇక కథలోకి వస్తే..రవీంద్ర(రవితేజ) కనక మహాలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) అనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ దగ్గర ఓ జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు హారిక(మేఘా ఆకాష్) తన తండ్రి(సంపత్ రాజ్) ని ఓ మర్డర్ కేసులో ఎవరో ఇరికించారు అని కనక మహాలక్ష్మి దగ్గరకి వస్తుంది. కానీ హారిక ని చూసిన రవీంద్ర ఆమెని మొదటి చూపు లోనే ఇష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తాను తీసుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి ఈ మర్డర్స్ చేసింది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కథలో మిగతా హీరోయిన్స్ పాత్రలు ఏంటి? ఆ కిల్లర్ దొరుకుతాడా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ప్లస్ ఆడియెన్స్ కి బాగా ఆశ్చర్యపరిచే బిగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త ఊహించని క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. డైరెక్టర్ రాసుకున్న రోల్ కి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఒక పూర్తిగా కొత్త రవితేజ ని ఈ రావణాసురలో మనం విట్నెస్ చెయ్యొచ్చు. నటన పరంగా తనలోకి కొత్త షెడ్ ని రవితేజ అద్భుతంగా పెర్ఫామ్ చేసి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తారు.

అలాగే ఇంట్రెస్టింగ్ రవితేజ నుంచి ఇంతకు ముందు చూడని డాన్సర్ రవితేజ ని కూడా చూడొచ్చు. ఇక కథనంలో కొన్ని ట్విస్ట్ లు మంచి ఆసక్తిగా థ్రిల్ కలిగిస్తాయి. అయితే ఎక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు ఎలా బాలన్స్ చేస్తారు అనే ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు కానీ దర్శకుడు ఈ అంశాన్ని బాగా హ్యాండిల్ చేసి అందరికి సమాన ప్రాధాన్యత కలిగిన సీన్స్ లో చూపించాడు.

ఫరియా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్ దక్ష నగర్కార్ అందరికీ మంచి రోల్స్ వారి పరిధిలో మంచి ఎమోషన్స్ తో కూడిన సీన్స్ లో కనిపిస్తారు. ఇక సుశాంత్ కూడా మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ సాలిడ్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంటారు. యాక్షన్ బ్లాక్స్ డిజైన్, ఇంటర్వెల్ బ్యాంగ్ లు ఇంప్రెస్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్ :




ఈ చిత్రంలో ఫస్టాఫ్ వరకు అంతా మంచి ఆసక్తిగానే సాగుతుంది కానీ సినిమాకి ఎంతో కీలకమైన సెకండాఫ్ లో మాత్రం ఈ ఫ్లో మరియు ఫ్రెష్ నెస్ కొనసాగదు అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం అలాగే పలు సీన్స్ కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే మెయిన్ కథలోకి వెళ్ళాక కూడా ప్లాట్ లో పెద్దగా కొత్తదనం కనిపించదు.

దీనితో ముందు బాగున్నా నరేషన్ అంతా దీనితో తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. అలాగే ఒక టైం లో అయితే సినిమాలో పాటలు కూడా అంత ఇంపార్టెంట్ అని కూడా అనిపించదు. మరో ముఖ్య పాయింట్ ఏమిటంటే రవితేజ నుంచి కొన్ని కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కోరుకునేవారికి కాస్త నిరాశ తప్పదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో అభిషేక్ ఆర్ట్స్ వారు నిర్మాణ విలువలు అయితే సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ని కూడా చాలా రిచ్ గా మంచి సెట్ వర్క్ ఆర్ట్ వర్క్ తో తమ ఖర్చు కనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీం లో మ్యూజిక్ ఇచ్చిన హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ ల పనితనం బాగుంది. ముఖ్యంగా సినిమాలో టెన్స్ వాతావరణం కి తగ్గ బాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని హైలైట్ చేస్తుంది. ఇక విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ తన విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. ఇక కాస్ట్యూమ్స్, డైలాగ్స్ వర్క్ బాగుంది.

ఇక దర్శకుడు సుధీర్ వర్మ విషయానికి వస్తే.. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలని తాను భాగం హ్యాండిల్ చేస్తాడు. అదే విధంగా రావణాసుర లో కూడా చాలా మంచి మంచి థ్రిల్ ని అలాగే ట్విస్ట్ లతో ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేపగలిగాడు. అయితే సినిమా మెయిన్ పాయింట్ ని మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడం కాస్త నిరాశ కలిగిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కూడా మరింత జాగ్రత్త వహించి ఉంటే ఓవరాల్ అవుట్ ఫుట్ మరింత సాలిడ్ గా ఉండేది. దీనితో తన వర్క్ కొంచెం యావరేజ్ కి మించి ఉంటుందని చెప్పవచ్చు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రావణాసుర” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ని సరికొత్త వెర్షన్ ఆకట్టుకుంది. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంది కానీ సుధీర్ వర్మ సినిమా కథ విషయంలో కాస్త కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యాల్సింది. అలాగే సెకండాఫ్ ఏమంత గొప్పగా ఉండదు, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఇది వరకే చూసిన రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఇవి పక్కన పెట్టి ఏ అంచనాలు లేకుండా సినిమా చూసే వారికి ఈ చిత్రం ఈ వారాంతానికి పర్వాలేదనిపించే ట్రీట్ అందిస్తుంది.

English Review