Prema Antha Easy Kadu 2019 Telugu Movie Review

Prema

ప్రేమ అంత ఈజీ కాదు మూవీ రివ్యూ ఆడియో – Prema Antha Easy Kadu Movie Review Audio

 

రాజేష్‌ కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కార్తీక్ (రాజేష్‌ కుమార్‌) చిన్నప్పటి నుంచీ ప్రేమ (ప్రజ్వాల్‌)ను చాలా సీరియస్ గా లవ్ చేస్తుంటాడు. ప్రేమే తన భార్య అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అయితే అది కార్తీక్ తండ్రికి అస్సలు నచ్చదు. దాంతో చిన్నప్పుడే కార్తీక్ ను ఇంట్లో నుంచి పంపించేసి.. హాస్టల్ లో జాయిన్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రేమను తానే మహారాణిలా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తాడు. ప్రేమ కోసం చివరికి కొడుకును కూడా దూరం చేసుకుంటాడు కార్తీక్ తండ్రి.

కాగా కార్తీక్ మాత్రం తండ్రికి తెలియకుండా ప్రేమ వెంట పడుతూ ప్రేమించమని బతిమిలాడుతుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ప్రేమ కార్తీక్ ను ప్రేమించినా, అతన్ని దూరం పెట్టాలని చూస్తోంది. లవ్ చేస్తున్నప్పటికీ కార్తీక్ ను ఎందుకు దూరం పెట్టాలనుకుంది ? అసలు ‘కార్తీక్ తండ్రి’ కొడుకును కూడా కాదనుకోని ప్రేమను ఎందుకు పెంచి పెద్ద చేస్తాడు ? ఈ క్రమంలో చివరకు ప్రేమ – కార్తీక్ ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన రాజేష్‌ కుమార్‌ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. డాన్స్, డైలాగ్ మాడ్యులేషన్ తో సహా రాజేష్‌ కుమార్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రజ్వాల్‌ తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, అలాగే తన నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక కమెడియన్స్ ధనరాజ్‌, రాంప్రసాద్‌ తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గోవాలో బీచ్ సన్నివేశంలో ధనరాజ్‌ తన మ్యానరిజమ్స్ తో నవ్విస్తాడు. ఇక హీరోకి తండ్రిగా నటించిన నటుడు కూడా చాలా బాగా నటించాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ప్రేమకు మరియు నమ్మకానికి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఈశ్వర్, ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌ ను కథకు అవసరం లేని సీన్లతో అనవసరమైన సాంగ్ లతో నడిపితేే, సెకెండ్ హాఫ్ ను సాగతీత సన్నివేశాలతో, పండిన ఎమోషనల్ సన్నివేశాలతో సాగ తీస్తూ సినిమాను ముగించాడు.

ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రేమ కథకు సంబంధించిన సన్నివేశాలు కూడా, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించవు. ముఖ్యంగా కథలోని మెయిన్ సంఘర్షణ బలంగా లేకపోవడం , పైగా పాత్రల మధ్య నడిచే డ్రామా కూడా బోర్ గా సాగడంతో.. సినిమా ఫలితం దెబ్బ తింది. ఇక హీరోయిన్ క్యారెక్టైజేషన్ కూడా మరీ బలహీనంగా ఉంది. దాంతో ప్రేమలో సీరియస్ నెస్ బాగా మిస్ అయింది. దర్శకుడు స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఈశ్వర్ ప్రేమకు మరియు నమ్మకానికి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికి.. దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. చక్రి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి.

జై.యం అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కాకపోతే పాటల్లో చాలా చోట్ల పాత చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఇక ఎడిటర్ శ్రీనివాస్‌ కంబాల పనితనం పర్వాలేదు. నిర్మాతలు టి.నరేష్‌, టి.శ్రీధర్‌ చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు.

తీర్పు :

రాజేష్‌ కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా ఈశ్వర్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. హీరో రాజేష్‌ కుమార్ నటన కూడా బాగానే ఉంది.

కానీ ఆకట్టుకోని కథనం, మెప్పించలేకపోయిన దర్శకత్వ పనితనం, ఆసక్తిగా సాగని కొన్ని ప్రేమ సన్నివేశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ చిత్రం లవర్స్ కు పర్వాలేదనిపిస్తోంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Teluguprazalu.com Rating : 2.25/5

Starring : Rhajesh Kumar, Prajwal Pooviaha

Director : Esshwar

Producers : T Naresh Kumar

Music Director : M Jai

Continuing the trend of low budget films, yet another film which was released today is Prema Anta Easy Kadu. Let’s see how the film turns out to be.

Story :

Right from his childhood, Karthik(Rajesh Kumar) loves Prema(Prajwal) a lot. But this does not go well with his dad and he kicks Karthik out of the village. Due to some unavoidable circumstances, Karthik’s dad is forced to take care of Prema for over some period time. Karthik comes back and starts wooing Prema but she does not oblige his love. Even though she likes him, Prema keeps avoiding Karthik. Why is she doing like that? What is the back story? Will Karthik and Prema finally meet? That forms the rest of the story.

Plus Points :

Hero Rajesh was good as the man lead. His performance in some emotional and action-filled scenes was very good. Rajesh’s dialogue delivery was also spot on. Heroine Prajwal looked glamorous and also performed with a lot of ease in the film.

Comedians Dhanraj and Ram Prasad tried to evoke a few laughs here and there. The Goa beach episode featuring Dharaj and his mannerisms were hilarious. The actor who played the hero’s father was also impressive in the emotional department.

Minus Points : 

The concept of love and belief looks good but the manner in which it is executed on screen looks jaded. The first half had many unnecessary scenes filled with bad humor. If this was not enough, the second half goes haywire with forced emotions and dragged scenes which are executed back to back.

The love story in the second half gets very weak and this is where the film goes for a toss. There should have been more drama to make things interesting between the lead pair which the makers missed completely.

Technical Aspects :

Music of the films was so-so as the songs obstruct the proceedings and come in as bits and pieces and id irritate the audience. Editing is disappointing and so was the production design. Camerawork and production values were okay. Coming to the director Eswar, he has done a disappointing job with the film as his narration had no seriousness at all with same old routine drama.

Verdict :

On the whole, Prema Anta Easy Kadu is a film which does not have anything going its way. Boring execution, routine story, and forced emotions kill the proceedings completely hereby making this film a tedious watch this weekend. Avoid it and look for something else this week.