Pogaru 2021 Telugu Movie Review

Pogaru

పొగ‌రు మూవీ రివ్యూ – Pogaru Movie Review

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని స్టార్ యాక్ట‌ర్ల‌లో ఒక‌రైన ధ్రువ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పొగ‌రు’. హ్యాట్రిక్ యాక్ష‌న్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధ్రువ స‌ర‌స‌న నాయిక పాత్ర‌ను ర‌ష్మికా మంద‌న్న నటించింది. పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :




శివ(ధ్రువ స‌ర్జా) చిన్న తనంలోనే తన తండ్రిని కోల్పోతాడు. ఆ తరువాత అతనికి తెలియనివ్వకుండా అతని తల్లి (పవిత్రా లోకేష్) రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. పెద్దయ్యాక ఆ విషయం తెలిసి శివ పూర్తిగా మారిపోతాడు. మొరటోడిగా మారతాడు. ఇలాంటి వ్యక్తి తన కాలనీలో ఉండే టీచర్ (రష్మిక)తో ప్రేమలో పడతాడు. ఆమె వల్ల ఇతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. అలాగే తన సవతి చెల్లి వల్ల శివ ఎలా మారాడు ? చివరకు అతను తన తల్లికి ఆవిడ కుటుంబానికి దగ్గరయ్యాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా పంతం సినిమా చూడాల్సిదే

ప్లస్ పాయింట్స్ :

ధ్రువ గత చిత్రాలకు భిన్నంగా ’ ఈ యాక్షన్ డ్రామా సాగింది. ఇక ధ్రువ లుక్స్ లో యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ధ్రువ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ధ్రువ, రష్మిక మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు. వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, హీరో గురించి రివీల్ చేసే ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి.

ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సంపత్ తో కలిపి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తమ్మీద ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో మధ్యమధ్యలో హీరో పాత్రకు సంబంధించి చిన్న క్యూరియాసిటీతో సరదాగా సాగుతుంది. ఇంటర్వెట్ ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ సెకెండాఫ్ మీద కొంత ఇంట్రస్ట్ పెంచుతుంది. ఇక సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించినా కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలలో దర్శకుడు హార్డ్ వర్క్ కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :




సినిమాలో కథనం తప్ప పెద్దగా కథ లేదు. కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా సన్నివేశాలతో సాగుతుంది. ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇప్పుటి సమాజంలో ఎంతవరకు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో చూపించినట్లు అంతదారుణమైన పరిస్థితులు ఒక వ్యక్తి జీవితంలో బయట ఎక్కడా మనకు కనిపించవు.

సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ కొంత స్టైలిష్ మేకింగ్ తో రిచ్ గా ఉన్నప్పటికీ సన్నివేశాలు ఎప్పటిలా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. హీరో తన సమస్యల గురించి అంతగా ఆలోచించి, దాని కోసం హీరో చేసే పనులు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా ఫస్ట్ హాఫ్ అంతా స్పీడుగా ఎంటర్ టైన్ గా సెకెండ్ హాఫ్ ఉండదు.

హీరోయిన్ రష్మిక, హీరోను ప్రేమించటానికి, హీరోతో సాంగ్స్ లో డాన్స్ చేయటానికి తప్ప ఆమె పాత్ర వల్ల కథకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అంత పాసీవ్ గా ఆమె పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే .. ద‌ర్శ‌కుడు క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ చివరకి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. ఇక పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా సాగుతూ రొటీన్ కమర్షియల్ సినిమాలా ముగుస్తుంది. ధ్రువ లుక్స్ ఆయన నటన, కొన్ని హాస్య సన్నివేశాలు క్లైమాక్స్ సన్నివేశంలోని ఎమోషన్ తప్ప ఈ చిత్రంలో ఇక చెపుకోవటానికి ఏమి ఉన్నట్లు అనిపించదు. ముఖ్యంగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా, ప్రేమ కథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే బాగుండేది. మొత్తం మీద ఈ చిత్రం పక్కా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నే అవకాశం ఉంది.

English Review