నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సంజయ్ (నాగశౌర్య) కి అనుపమ (మాళవికా నాయర్) బీటెక్ లో సీనియర్. సీనియర్స్ ర్యాగింగ్ నుంచి అనుపమ (మాళవికా నాయర్) సంజయ్ (నాగశౌర్య)ను సేవ్ చేస్తుంది. అలా మొదలైన వీరి పరిచయం.. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. లవర్స్ గా మారతారు. ఆ తర్వాత ఎంఎస్ కోసం లండన్ వెళ్ళి లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే, ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో సంజయ్ కి స్నేహం మొదలు అవుతుంది. దీంతో సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. మరి ఆ తర్వాత వీరిద్దరూ జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి ?, చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసినప్పుడు వీరి మధ్య ఏం జరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల) పాత్ర ఏమిటి ?, చివరకు సంజయ్ (నాగశౌర్య) – అనుపమ (మాళవికా నాయర్) కలిశారా ? లేదా ?, కలిస్తే ఎలా కలిశారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగానే ఉంది. అలాగే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య లాంగ్ జర్నీని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల బాగా ఎలివేట్ చేశాడు. ఇక ఈ చిత్ర హీరో నాగశౌర్య సినిమాలోని తన పాత్రకు తగ్గట్లు లుక్స్ పరంగా అలాగే నటన పరంగా కూడా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
అదే విధంగా హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మాళవిక చాలా బాగా మెప్పించింది. హీరోహీరోయిన్లకు స్నేహతులుగా నటించిన అభిషేక్ మహర్షి, శ్రీవిద్య కూడా చాలా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. మెయిన్ కథలో స్ట్రాంగ్ కంటెంట్ మిస్ అయ్యింది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత డెప్త్ గా చూపిస్తే బాగుండేది. చాలా సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో లండన్ నేపథ్యంలో జరిగే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు ప్లేను ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ అవి స్క్రీన్ మీద పండలేదు.
కథనంలో కూడా చాలా లోపాలు కనిపిస్తాయి. వివిధ టైమ్ లైన్స్ లో జరిగిన లవ్ డ్రామా కూడా కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. పైగా కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది.
ఇక కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. మొత్తమ్మీద స్టోరీగా తీసుకున్న స్లాట్ బాగున్నప్పటకీ కథనం అంతా పాతదే కావడంతో తదుపరి వచ్చే సీన్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి, అలానే ఎటువంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు వంటివి కూడా ఈ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీలో మిస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో పని చేసిన వారి పనితీరు బాగానే ఉంది. సినిమాలోని ప్రతి సీన్ ని విజువల్ గా ఎంతో అందంగా చూపించారు సునీల్ కుమార్ నామా. కళ్యాణి మాలిక్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. అలానే నిర్మాతలు నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తన గత సినిమాల మాదిరిగా ఈ మూవీని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేకపోయారు.
తీర్పు :
ఓవరాల్ గా ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, అలాగే ఫేక్ ఎమోషన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాలో నాగశౌర్య -మాళవిక నటన బాగుంది. కానీ సినిమా మాత్రం నిరాశ పరిచింది. కాకపోతే, ఎమోషనల్ అండ్ లవ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో ఒకటి రెండు అంశాలు కనెక్ట్ అవుతాయి. సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.