organic Mama Hybrid Alludu 2023 Telugu Movie Review

Organic

ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు మూవీ రివ్యూ – Organic Mama Hybrid Alludu Movie Review

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బిగ్‌ బాస్‌ ఫేం సోహెల్‌ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళిని హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




విజయ్ (సోహెల్‌) రెండు ప్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు. హాసిని ( మృణాళిని రవి) ఆర్గానిక్ వెంకట రమణ (రాజేంద్రప్రసాద్‌) కూతురు. కూతుర్ని ఆర్గానిక్ వెంకట రమణ ఎంతో అపురూపంగా పెంచుకుంటాడు. ఆమె విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. అయితే, ఆర్గానిక్ వెంకట రమణ భయ పడినట్లుగానే.. హాసిని విజయ్ తో ప్రేమలో పడుతుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ – హాసిని ప్రేమ కథ ఎలా సాగింది ?, ఆర్గానిక్ వెంకట రమణ వీరి ప్రేమను అంగీకరించాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ అంటూ కామెడీ లవ్ డ్రామాతో వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి, ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో ప్రధానంగా విజయ్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు కొన్ని చోట్ల పర్వాలేదు.

హీరోగా నటించిన బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ చాలా బాగా నటించాడు. తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సోహెల్‌ ఆకట్టుకున్నాడు. విజయ్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్ గా నటించిన మృణాళిని రవి తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నటించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది. ఇక పేరెంట్స్ పాత్రల్లో కనిపించిన రాజేంద్రప్రసాద్, మీనా చాలా బాగా నటించారు. మీనా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :




దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాను రాసుకున్న లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. విజయ్ – హాసిని మధ్య సాగే సీన్స్ బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికీ తోడు పాత చిత్రాల ప్రభావం ఈ చిత్రం పై మరీ ఎక్కువగా ఉంది.

పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు సరైన కథా కథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా చేసిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. నమ్మశక్యం కాని సన్నివేశాలతో, ఇంట్రెస్ట్ కలిగించలేని ప్లేతో అండ్ వర్కౌట్ కాని కామెడీ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఐతే, కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు.

English Review