Most Eligible Bachelor 2021 Telugu Movie Review

Most

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ రివ్యూ – Most Eligible Bachelor Movie Review

అఖిల్ అక్కినేని అలాగే పూజా హెగ్డే కాంబోలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”. ఎట్టకేలకు ఈ సినిమా ఈ దసరా పండుగ కానుకగా వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతమేర ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేసిందో సమీక్షలో పరిశీలిద్దాం రండి.

కథ :




ఇక కథలోకి వచ్చినట్టయితే..హర్ష(అఖిల్) అమెరికాలో ఒక బాగా సెటిల్ అయ్యిన ఎన్ ఆర్ ఐ సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్. అలాగే తన జీవితానికి సంబంధించి పెళ్లి విషయంలో చాలా ప్లాన్ చేసుకొని ఇండియాకి పెళ్లి సంబంధం కోసం వస్తాడు. అయితే ఎన్నో చూస్తుంటాడు కానీ ఫైనల్ గా విభ(పూజా హెగ్డే) ను చూసి ఆగుతాడు. కానీ ఆమె మాత్రం చాలా ప్రాక్టికల్ గా తన లైఫ్ లో ఉంటుంది. మరి వీరిద్దరికీ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? పుట్టినా మధ్యలో ఏమవుతుంది? ఫైనల్ గా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కి పెళ్లి అవుతుందా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొట్టమొదటగా చెప్పాలి అంటే అఖిల్ నుంచే స్టార్ట్ చెయ్యాలి. ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించడమే కాకుండా తన నటనలో కూడా చాలా పరిణితి కనబరిచాడు. డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ లుక్స్ పరంగానే కాకుండా తనలోని నటనను కూడా మరింతలా సినిమాలో మెరుగుపరిచాడు. ఇంకా అలాగే కొన్ని ఫన్ సీన్స్ లో కానీ పూజా తో సన్నివేశాల్లో కానీ కొంత మందికి ఉన్న డౌట్స్ ని అని చాలా క్లీన్ అండ్ క్లియర్ గా తుడిచేస్తాడు అని చెప్పాలి.

అలాగే పూజా రోల్ కూడా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపిస్తుంది. ఒక స్టాండప్ కమెడియనీ గా అలాగే బాగా క్లారిటీగా ఉండే విమెన్ పాత్రలో తాను బాగా చేసింది. అలాగే భాస్కర్ తన పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

ఇంకా సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ అయితే డెఫినెట్ గా ఆడియెన్స్ ని అలరిస్తాయని చెప్పొచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ ని కోరుకొని వెళ్లేవారిని ఈ చిత్రం నవ్విస్తుంది. సాంగ్స్ కూడా విజువల్ గా బాగున్నాయి. ఇంకా నటులు మురళీ శర్మ, ప్రగతి, వెన్నెల కిషోర్ సుడిగాలి సుధీర్ లు తమ పత్రాలు జస్టిస్ చేశారు.

మైనస్ పాయింట్స్ :




అవును సినిమా అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా కాస్త రొటీన్ మోతాదు కూడా కనిపిస్తుంది. అలాగే సినిమా కథ పరంగా మరింత రొమాంటిక్ ఎపిసోడ్స్ ని జోడించే అవకాశం ఉంది కానీ దర్శకుడు ఆ పని చేయలేదు.

అలాగే అక్కడక్కడా కాస్త స్లో అయ్యినట్టు కూడా అనిపిస్తుంది. వీటితో పాటుగా చాలా సన్నివేశాల్లో ముఖ్యంగా లాజిక్స్ మిస్సయ్యినట్టు అనిపిస్తాయి. ఇంకా కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్ జస్ట్ ఇరికించినట్టు కాకుండా ఇంకా బలంగా ఉండి ఉంటే బాగుండు.

అలాగే ఎమోషన్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి ఉండాల్సింది. అయితే ఫ్యామిలీ రిలేషన్స్ కి సంబంధించి పెళ్లి ఆ తర్వాత కొన్ని సమస్యలపై డిటైల్స్ ఇంకా వాటిలోని లోతు మిస్సయ్యినట్టు కూడా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగుంటాయి సినిమా సెటప్ అంతా కూడా హై క్వాలిటీ విజువల్స్ తో కనిపిస్తుంది. యూఎస్ ఎపిసోడ్స్ లో కానీ ఇండియా వచ్చాక అంతా కూడా విజువల్స్ పరంగా నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా గోపి సుందర్ సాంగ్స్ విజువల్ గా ఇంకా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయ్, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బావుణ్ణు.

ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ విషయానికి వస్తే.. చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ సినిమాతో వచ్చి తన డైరెక్షన్ తో ఓవరాల్ గా పూర్తి స్థాయిలో కాకపోయినా మెప్పిస్తారని చెప్పొచ్చు. సింపుల్ లైన్ తో ఫ్యామిలీ అంతా కాసేపు ఎంటర్టైన్ అయ్యే విధంగా డీల్ చేసిన విధానం బాగుంది. అంతే కాకుండా ప్రెజెంట్ జెనరేషన్ లో పెళ్లి కాన్సెప్ట్ ని బాగా చూపించారు. కానీ ఇంకా లోతుగా పరిశీలిస్తే తన గత సినిమాల్లో గల బలమైన ఎమోషన్స్ ని లాజిక్స్ ని ఇంకా బెటర్ గా తీసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.. ఇవి మినహా భాస్కర్ వర్క్ లో అంతా బాగానే అనిపిస్తాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” లో ఎంటర్టైన్మెంట్ పరంగా వచ్చే ఆడియెన్స్ ని బాగానే అలరిస్తుంది. పెళ్లి కాన్సెప్ట్ ని ప్రస్తుత జెనరేషన్ కి రిలేటెడ్ గా చూపించిన విధానం కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఒక కొత్త అఖిల్, పూజా హెగ్డేలను చూసాం అనే ఫీలింగ్ అన్నీ బాగుంటాయి కాకపోతే కొన్ని ఎమోషన్స్ పలు సన్నివేశాల్లో సరైన లాజికల్ ఎండింగ్స్ లేకపోవడం మైనస్ అనిపిస్తాయి. ఇవి పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ చిత్రం మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

English Review