Laatti 2022 Telugu Movie Review

Laatti

లాఠీ మూవీ రివ్యూ – Laatti Movie Review

విశాల్ నటించిన తాజా చిత్రం ‘లాఠీ’. ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




మురళీ కృష్ణ (విశాల్) ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. తన ఉద్యోగం పట్ల ఎంతో విధేయత కలిగిన వ్యక్తి. అయితే, ఓ అమ్మాయి మర్డర్ కేసులో సస్పెండ్ అవుతాడు. తన భార్య కవిత (సునైనా)తో, తన కొడుకుతో లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మురళీ కృష్ణ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఐతే, భయంకరమైన నేరస్థుడు వీరతో మురళీ కృష్ణ కి వైర్యం పెరుగుతుంది ? అసలు ఈ వీర ఎవరు ?, మురళీ కృష్ణను ఎందుకు టార్గెట్ చేశాడు, ఇంతకీ మురళీ కృష్ణ ఏం చేశాడు , ఈ మధ్యలో తన కుమారుడు వీర ముఠా చేతులకు ఎలా చిక్కాడు ?, మురళీ కృష్ణ తన కొడుకును ఎలా సేవ్ చేసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్రజలకు సమస్య వస్తే.. పోలీసులు వెళ్తారు, రాజకీయ నాయకులకు సమస్య వస్తే పోలీస్ డిపార్ట్మెంటే వెళ్తుంది. మరీ ఒక పోలీస్ కానిస్టేబుల్ కి సమస్య వస్తే.. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఫ్యామిలీ సమస్యలో ఉంటే.. తనను తన ఫ్యామిలీని ఆ కానిస్టేబుల్ ఎలా సేవ్ చేసుకున్నాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ లాఠీ సినిమా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. తన పరిపక్వతమైన నటనతో విశాల్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన ప్రభు కూడా చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన సునైనా తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. మెయిన్ గా హీరో – విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. మరో కీలక పాత్రలో నటించిన మునిష్కాంత్ కూడా బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :




హై యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎ వినోద్ కుమార్ దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్ ఉన్నా గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని పోలీస్ డ్రామాతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. దీనికి తోడు ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కి ఎన్ని సమస్యలు ఉంటాయో.. వారి జాబ్ లో ఎంత రిస్క్ ఉంటుందో చాలా క్లారిటీగా చూపించారు. సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి.

దీనికితోడు కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ను రాసుకున్నా.. అవి కూడా పూర్తి సినిమాటిక్ గా సాగాయి. విశాల్ అభిమానులకు ఈ సినిమాతో కొంతవరకు నిరాశ తప్పదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు రమణ & నందా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

♦ ట్రైలర్ : లాఠీ – విశాల్, సునైనా – 22/12/2022 – Laathi Trailer – Vishal, Sunaina

తీర్పు :

లాఠీ అంటూ వచ్చిన ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో సాధారణ పోలీస్ ల సమస్యలను ప్రస్తావించడం బాగుంది. కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్ పర్వాలేదు. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. కథాకథనాల్లో ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, చాలా చోట్ల ప్లే బోర్ గా సాగడం, సినిమాలో ముఖ్యమైన కొన్ని సీక్వెన్స్ లో లాజిక్ లు కూడా లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

English Review