Kotabommali PS (2023) Telugu Movie Review

Kotabommali P.S

కోటబొమ్మాళి పి.ఎస్ మూవీ రివ్యూ

సినిమా పేరు: కోటబొమ్మాళి పి.ఎస్
నటీనటులు: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, దయానంద్ రెడ్డి..
రచయిత మరియు దర్శకుడు: తేజ మార్ని
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు – భాను ప్రతాప మరియు రియాజ్ చౌదరి
నిర్మాణం : గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్
సంగీతం : రంజిన్ రాజ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకాటి
విడుదల తేదీ : 24 నవంబర్ 2023

నటుడు శ్రీకాంత్, శివాని రాజశేఖర్ అలాగే రాహుల్ విజయ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కోట బొమ్మాళి పి ఎస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

శ్రీకాకుళం కోట బొమ్మాళి ప్రాంతంలో పని చేసే ముగ్గురు పోలీసులు రామకృష్ణ(శ్రీకాంత్) అలాగే తన జూనియర్స్ రవి(రాహుల్ విజయ్) మరియు కుమారి (శివాని రాజశేఖర్) లు అప్పటికే ఆ ప్రాంతంలో జరుగుతున్న బై ఎలక్షన్ సమయంలో తాము చేయని ఓ తప్పుకి ప్రధాన నిందితులుగా చిత్రీకరించబడతారు. దీనితో వారిని పట్టుకోడానికి హోమ్ మినిష్టర్ పరిసల జైరాజ్ (మురళీ శర్మ) ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రజియా అలీ(వరలక్ష్మీ శరత్ కుమార్) ని నియమిస్తారు. మరి ఆమె ఆ ముగ్గురుని పట్టుకుంటుందా? వారు నిరపరాదులుగా ప్రూవ్ అవుతారా లేదా? రామకృష్ణ తన ఎక్స్ పీరియన్స్ తో ఈ సవాళ్లు ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్లు :

ఈ చిత్రంలో కథ అంతా ముగ్గురు ప్రధాన పాత్రలు అయిన శ్రీకాంత్, రాహుల్ విజయ్ మరియు శివాత్మికల మీదనే నడుస్తుంది. మరి ఈ మూడు పాత్రలకు కూడా ఈ ముగ్గురు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అని చెప్పాలి. మెయిన్ గా శ్రీకాంత్ ని అయితే చాలా రోజులు తర్వాత ఒక కదిలించే రోల్ లో చూసినట్టు అనిపిస్తుంది.

తన సీన్స్ అన్నీ మంచి రసవత్తరంగా అనిపిస్తాయి. తన రోల్ ని తాను పర్ఫెక్ట్ గా పండించగా తనతో పాటు సినిమా చివర వరకు ట్రావెల్ అయ్యిన యంగ్ నటులు శివాని మరియు రాహుల్ విజయ్ లు ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ లను అందించారు.

ఇక ఈ చిత్రంలో సాలీడ్ ఎమోషన్స్ కానీ గ్రిప్పింగ్ నరేషన్ కానీ మంచి థ్రిల్లర్ లేదా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తరహా సినిమాలను చూసేవారిని మెప్పిస్తుంది. మెయిన్ గా శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ల నడున నడిచే మైండ్ గేమ్ సీక్వెన్స్ లు ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి. ఇక క్లైమాక్స్ సినిమాలో మరో ప్రధాన బలం అని చెప్పాలి. ఓ ఎమోషనల్ అండ్ క్లీన్ ఎండింగ్ సినిమాని పర్ఫెక్ట్ గా ముగుస్తుంది.

మైనస్ పాయింట్లు :

ఈ చిత్రంలో ఆసక్తికరమైన పాయింట్ అండ్ ఎమోషన్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు దానిలో లీనం అవ్వడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. సినిమా స్టార్టింగ్ కాస్త స్లో గానే ఉంటుంది. అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఆశించే వారికి అవి ఇందులో అంతగా ఏమి ఉండవు.

దీనితో పాటుగా కథనం అక్కడక్కడా కాస్త స్లో గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో కొన్ని చోట్ల బోర్ ఫీల్ కలగొచ్చు. అలాగే ఒరిజినల్ తో పోలిస్తే శ్రీకాంత్ రోల్ ని ఇంకాస్త డెప్త్ గా ప్రెజెంట్ చేసి ఉంటే సినిమా లో తన మరింత ఎఫెక్టివ్ గా అనిపించవచ్చు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్ 2 వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా చాలా నాచురల్ గా సినిమాని తెరకెక్కించారు. టెక్నీషియన్ టీం లో రంజిన్ రాజ్ మ్యూజిక్ బాగుంది. అలాగే జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు తేజ మార్ని విషయానికి వస్తే.. ఒరిజినల్ చిత్రం ‘నాయట్టు’ కి తను ఓ ప్రామిసింగ్ రీమేక్ ని అందజేసే ప్రయత్నం చేసారని చెప్పాలి. మంచి సబ్జెక్ట్ ని డీసెంట్ నరేషన్ తో ప్రెజెంట్ చేశారు. కొన్ని లోటుపాట్లు మినహా ఈ సినిమాకి తన వర్క్ బాగుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కోట బొమ్మాళి పి ఎస్” లో శ్రీకాంత్ రోల్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అయితే స్లోగా నడిచే ఫస్టాఫ్ కొంతమేర బోర్ సన్నివేశాలు పక్కన పెడితే ఇంప్రెస్ చేసే సెకండాఫ్ మంచి మైండ్ గేమ్ ట్విస్ట్ లు సహా ఎమోషనల్ క్లైమాక్స్ తో మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని ఈ వారాంతానికి ఈ చిత్రంని ట్రై చేయవచ్చు.

English Review