Keedaa Cola (2023) Telugu Movie Review

Keedaa Cola

కీడా కోలా మూవీ రివ్యూ

సినిమా పేరు: కీడా కోలా
నటీనటులు : చైతన్య రావు, తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, రఘు రామ్, జీవన్ కుమార్, రాగ్ మయూర్, హరి కాంత్
రచయిత మరియు దర్శకుడు: తరుణ్ భాస్కర్ దాస్యం
నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
సమర్పకుడు: రానా దగ్గుబాటి
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ
సినిమాటోగ్రాఫర్: AJ ఆరోన్
ఆర్ట్ డైరెక్టర్ : ఆశిష్ తేజ పులాల
యాక్షన్: రాజ్ కుమార్
విడుదల తేదీ : 3 నవంబర్ 2023

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా తో వచ్చాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వరదరాజు (బ్రహ్మానందం) తన మనవడు వాసు ( చైతన్య రావు)తో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, వాసు వ్యక్తిగత సమస్యల కారణంగా అతని జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది. ఈ లోపు వాసు స్నేహితుడు కౌశిక్ (మయూర్ రాగ్) ఇచ్చిన కీడా కోలా బాటిల్ ఐడియాతో కోట్లలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఇంతకీ ఆ ఐడియా ఏమిటి ?, దాని కోసం వాళ్ళేం చేశారు ?, మరోవైపు నాయుడు (తరుణ్ భాస్కర్) ఇరవై ఏళ్ళు జైలులో గడిపి వస్తాడు. తన తమ్ముడు జీవన్ కోసం ఓ ప్లాన్ వేస్తాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటి ?, ఈ ప్లాన్ కి వాసు – కౌశిక్ ల ఐడియాకి ఉన్న సంబంధం ఏమిటి ?, చివరికి ఈ కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

క్రైౖమ్‌ కామెడీ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ ‘కీడా కోలా’ కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూ ఈ సినిమా సస్పెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగింది. సినిమాలో కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ ఎంటర్టైనింగ్ సీక్వెన్స్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో నాయుడు పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు..

అలాగే కీడా కోలా బాటిల్ తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే సస్పెన్స్ ఎలిమెంట్స్.. సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక హీరో చైతన్య రావు చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక వీక్ పర్సన్ గా చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఇరుక్కునే సీన్స్ లో కూడా చాలా సెటిల్డ్ గా నటించాడు.

తరుణ్ భాస్కర్ నటన చాలా బాగుంది. రాగ్ మయూర్, జీవన్ తమ కామెడీతో ఈ సినిమాకి ప్రాణం పోసారు. వారి డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. బ్రహ్మానందం మంచి పాత్రలో కనిపించారు. రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, విష్ణు, హరికాంత్ తమ పాత్రల్లో జీవించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తన టేకింక్ తో తరుణ్ భాస్కర్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల పై మోశాడు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ కీడా కోలా సినిమాలో కామెడీ మరియు సస్సెన్స్.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనం పూర్తి ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమా పలు చోట్ల బోర్ గా సాగడం, సెకండాఫ్ లో ఉన్నంత ఫన్, ఫస్ట్ హాఫ్ లో మిస్ అవ్వడం, అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో కొన్ని చోట్ల సహజత్వం లోపించింది. అలాగే, ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాల పై ముఖ్యంగా కథ పై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది.

సినిమాలో టేకింగ్ చాలా బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్ కామెడీ మూవీలా లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ ఏజే ఆరోన్‌ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కామెడీ అండ్ కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ ఉపేంద్ర వర్మ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ మంచి కథాంశంతో పాటు మంచి కామెడీని మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలను బాగా రాసుకున్నాడు. అలాగే, బాగా తెరకెక్కించాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆయన తడబడ్డాడు.

తీర్పు :

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘కీడా కోలా’ చిత్రం కామెడీగా సాగుతూ కొన్ని చోట్ల సస్సెన్స్ కామెడీతో పాటు కొన్ని యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కామెడీ సీన్స్ ఆసక్తికరంగా సాగాయి. కానీ, పెద్దగా కథ లేకపోవడం, కథనంలో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.

ఈ సినిమా ఓవరాల్ గా మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో పాటు కామెడీ మూవీస్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.

English Review