Jaanu 2020 Telugu Movie Review

Jaanu

జాను మూవీ రివ్యూ – Jaanu Movie Review




తమిళ్‌ లో మంచి హిట్ టాక్ సంపాదించుకున్న 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్‌రాజుకు చాలా పొరపాట్లు ఎదురయ్యాయి. అయితే జాను పేరుతో నేడు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం.




కథ :

రామ్ (శర్వానంద్) తన హైస్కూల్ ప్రియురాలు జాను (సమంత). అయితే జానును చిన్న తనంలోనే ప్రేమించినా ఎప్పుడూ కూడా రామ్ జానుకి ప్రపోజ్ చేయడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత వీరి చిన్ననాటి స్నేహితులంతా కలిసి గెట్ టూ గెదర్ ఏర్పాటు చేస్తారు. ఆ గెట్ టూ గెదర్‌లో రామ్ మరియు జాను ఇద్దరు మళ్ళీ కలుస్తారు. 15 సంవత్సరాల తరువాత కలిసిన వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది ? వీరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎటువంటిది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపైన చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘జాను’ వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రేమ్ కుమార్‌కే దక్కుతుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన ఎమోషన్ తో అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగింది ఈ సినిమా.

ఇక తాను మంచి నటుడని అని శర్వానంద్ మరోసారి నిరూపించుకున్నాడు. అతను తన కెరీర్‌లో రామ్ పాత్ర ద్వార ఉత్తమ నటనను కనబరిచాడు. అమాయకత్వం లేదా భావోద్వేగాల పరిపక్వతలను శర్వానంద్ తన నటనతో శర్వానంద్ దానిని మరో స్థాయికి తీసుకువెళ్లడు. అతను ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు.

సమంతకి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా మరింత అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ల జోడీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరు కాకుండా వేరేవారిని ఊహించుకోలేమన్నట్టుగా వీరు ఆకట్టుకున్నారు, ఈ చిత్రానికి బీజీఎం కూడా అద్భుతంగా ఉంది.




మైనస్ పాయింట్స్ :

ఒక భగ్న ప్రేమికుడికి జీవితంలోని సంఘటనలను బాగా రాసుకున్న దర్శకుడు స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను బాగా స్లోగా నడిపారు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

ఈ సినిమా రీమేక్ కావడంతో ప్రేక్షకులు అసలు సినిమాతో ఈ సినిమాను పోల్చి చూసుకుంటే మాత్రం కాస్త నిరాశపడొచ్చు. పైగా ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అని మాత్రం చెప్పలేము. ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది, ఈ సినిమా కథనం సాదాసీదాగా ఉండడంతో ప్రేమకథలో నాటకీయత కానీ, ఎలాంటి మలుపులు కానీ కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్యూర్ లవ్ స్టోరీకి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. మహేందిరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో స్కూల్ దృశ్యాలతో పాటు కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోవింద్ వసంతన్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సమంత , శర్వాల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని నిర్మాత దిల్ రాజు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే జాను మూవీ ఒరిజినల్ 96 మూవీలోని అన్ని ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కిన పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పాలి. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు జాను చిత్రాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఐతే 96 మూవీ చూసిన వారికి కొంచెం స్లో గా సాగింది అనే భావన కలిగే అవకాశం కలదు. సమంత, శర్వా ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్క్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. జాను మరియు రామ్ పాత్రలో వారు లీనమై నటించారు. జాను ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. మల్టీప్లెక్ ప్రేక్షకులను ఈచిత్రం మరింత ఆకట్టుకుంటుంది.

English Review