Gandeevadhari Arjuna (2023) Telugu Movie Review

Gandeevadhari Arjuna

గాండీవధారి అర్జున మూవీ రివ్యూ – Gandeevadhari Arjuna Movie Review

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన గాండీవధారి అర్జున నేడు థియేటర్ల లోకి వచ్చింది. మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ఎక్స్ రా ఏజెంట్. అయితే సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ ( నాజర్) ప్రాణానికి ముప్పు పొంచి ఉండటం తో వరుణ్ తేజ్ ను ఏజెంట్ గా తీసుకుంటారు. నాజర్ కి ఎవరి నుండి ప్రాణ హని ఉంది? హీరోయిన్ ఐరా (సాక్షి వైద్య) కి కథతో ఎలాంటి సంబంధం ను కలిగి ఉంది? మరి హీరో అర్జున్ నాజర్ ను కాపాడగలిగారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

హీరో వరుణ్ తేజ్ సినిమాకి అతి పెద్ద ప్లస్. సినిమా మొత్తాన్ని తన నటన తో, యాక్షన్ తో ఈజ్ గా క్యారీ చేశారు. వరుణ్ తేజ్ ఫైట్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. హీరోయిన్ సాక్షి వైద్య గ్లామర్ తో పాటుగా, పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసింది. సినిమాలో ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది.

సినిమాలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కి, కల్పలత మధ్యలో ఉన్నటువంటి ఎమోషనల్ సన్నివేశాలు సినిమా ను మంచి మూడ్ లో డ్రైవ్ చేస్తాయి.

మిక్కీ జే మేయర్ సినిమాలో మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా హైలైట్ చేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను కూడా రిచ్ గా, విజువల్ గా బాగా చూపించడం లో ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాను బాగా ప్రెజెంట్ చేయడం లో డైరెక్టర్ విఫలం అయ్యారు. తను ఎంచుకున్న సబ్జెక్ట్ బాగానే ఉన్నా, అంత ఎంగేజింగ్ గా సినిమా సాగలేదు.

ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సాగతీత సన్నివేశాలు ఉన్నాయి. చాలా అనవసర సన్నివేశాలు ఆడియెన్స్ కి బోరింగ్ ను కలిగిస్తాయి.

సినిమాలో మంచి మెసేజ్ ను అందించడానికి మేకర్స్ ప్రయత్నించారు. దానికి అనుగుణమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లేదు. రోషిని ప్రకాష్ సినిమాలో కీలక పాత్రను కలిగి ఉంది. అయితే సినిమాలో సబ్జెక్ట్ కి కావాల్సిన డెప్త్ ను అందించడం లో విఫలం అయ్యింది. మేకర్స్ వాటిని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉండవచ్చు.

గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ అనేది ఎప్పటికీ ఒక హాట్ టాపిక్. అలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేసేప్పుడు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా మంచి ట్విస్ట్ లను కలిగి ఉండాలి. ఇందులో అలా జరగలేదు. సస్పెన్స్, మిస్టరీ లనూ క్యారీ చేయలేదు.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రం తో పర్వాలేదు అని అనిపించుకున్నాడు. మరో మంచి ప్రయత్నం చేశాడు. కాకపోతే సరైన కథనం కలిగి ఉండి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వరుణ్ తేజ్, సాక్షి వైద్య లతో పాటుగా ఇతర నటీనటుల నటన బాగుంది.

సినిమాలో పాటలు పర్వాలేదు. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఇందులో బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉండవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

గాండీవదారి అర్జున అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోదు. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. అనవసర సన్నివేశాలు, స్లోగా సాగే కథనం సినిమా పై ప్రభావాన్ని చూపించాయి. ఆడియెన్స్ ను ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.

English Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *