ధూత వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ పేరు: ధూత
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు,
సత్యప్రియ భవానీ శంకర్
రచయిత మరియు దర్శకుడు: విక్రమ్ కె కుమార్
నిర్మాత: శరత్ మరార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ కె కుమార్
సంగీతం: ఇషాన్ ఛబ్రా
కళా ప్రక్రియలు: డ్రామా, హారర్, థ్రిల్లర్
ఓటీటీ ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ: 1 డిసెంబర్ 2023
నాగచైతన్య తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ దూత. మొత్తంగా 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని శరత్ మరార్ నిర్మించగా విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది పూర్తి సమీక్ష లో చూద్దాం.
కథ :
సాగర్ (నాగ చైతన్య) మొదట జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా పైస్థాయికి ఎదుగుతాడు. దీంతో సాగర్ చాలా ఉప్పొంగిపోతాడు, అయితే తన జీవితంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని వార్తాపత్రికలు క్లిప్పింగ్‌లుగా ఈ విషాదాలను ముందుగానే అంచనా వేస్తాయి. మరి అది ఎలా సాధ్యం, సాగర్‌కి తన ప్రొఫెషన్ లో శత్రువులు ఎవరైనా ఉన్నారా, మరి చివరిగా ఆ వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల వెనుక రహస్యాన్ని సాగర్ ఛేదించగలిగాడా లేదా అనేది మొత్తం దూత సిరీస్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముందుగా దేనికైనా కథ ప్రధానం, అనంతరం దానిని దర్శకడు ఎలా ఆడియన్స్ కి కనెక్ట్ చేసాడు అనేది మరింత ముఖ్యం. నిజానికి దూత లో ప్రధాన పాయింట్ పాతదే అలానే గతంలో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమాల్లో వచ్చిందే. అయితే దూత కథనాన్ని మాత్రం విక్రమ్ కుమార్ అద్భుతంగా ముందుకు నడిపారు అని చెప్పాలి. నిజానికి ఇటువంటి పాత కథని తీసుకుని ఇంట్రెస్టింగ్ గా ఇప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం మాములు విషయం కాదు.
ఫస్ట్ ఎపిసోడ్ నుండి దాదాపుగా ప్రతి ఎపిసోడ్ లో కూడా మనల్ని ఆకట్టుకుంటుంది దర్శకుడి టేకింగ్. ముఖ్యంగా సస్పెన్స్ ని బాగా హ్యాండిల్ చేయడంతో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీన్స్ మనల్ని ఎంతో అలరిస్తాయి. మధ్యలో వచ్చే కొందరి క్రైమ్ తో పాటు డెత్ సన్నివేశాలు మనకు ఏమి జరుగుతోంది అనేటువంటి ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతాయి. దీని ద్వారా సొసైటీ కి దర్శకుడు విక్రమ్ కె కుమార్ మంచి మెసేజ్ ని అందించారు.
అలానే ఇదేమి మనపై ఫోర్స్ ఫుల్ గా కూడా ఉండదు. ప్రతి క్యారెక్టర్ లో ఎంతో డెప్త్ ఉండడంతో పాటు చివరి వరకు ప్రతి క్యారెక్టర్ కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా ముందుకి తీసుకుకెళుతుంది. ముఖ్యంగా నాగ చైతన్య తన తొలి వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించారు. తన క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉన్నా, వాటిని బాగా పెర్ఫార్మ్ చేసారు. తన ఫ్యామిలీ యొక్క సేఫ్టీ ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా ఆయన తన క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా యాక్ట్ చేశారు.
ఇక పార్వతి తిరువోతు కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఎంతో బాగా నటించారు. ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్ తదితరులు తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ట్విస్ట్‌లు ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ సాగె క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. సిరీస్ అంతటా వర్షపు నేపథ్యం ఆడియన్స్ కి కొత్త అనుభవాన్ని అందిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
అయితే ఈ సిరీస్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు. వాటిని మరింత బాగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ రాసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. అలానే రన్ టైం పరంగా కూడా కొంత లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. మధ్యలో అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ లో సిరీస్ వేగం తగ్గుతుంది. సిరీస్ లోని కొన్ని డైలాగులు అక్కడక్కడ కొందరు ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి.
సాంకేతిక వర్గం :
ఇషాన్ చాబ్రా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతో బాగుంది. మికోలాజ్ సైగులా యొక్క సినిమాటోగ్రఫీ కూడా సూపర్ అనే చెప్పాలి. విజువల్స్ తో పాటు సిరీస్ మొత్తం కూడ ఎంతో గ్రాండ్ గా ఉంది. అయితే ఎడిటింగ్ విభాగం మరింతగా వర్క్ చేసి కొన్ని సీన్స్ అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సింది. గతంలో డిజప్పాయింట్ చేసిన విక్రమ్ కుమార్, ప్రస్తుతం దూత సిరీస్ తో సింపుల్ పాయింట్ తీసుకుని దానిని ఆడియన్స్ కి కనెక్ట్ చేసే విధంగా ఎడ్జ్ థ్రిల్లర్ గా బాగా తెరకెక్కించారు. అలానే ఇందులో సొసైటీ కి ఇచ్చిన మెసేజ్ కూడా ఎంతో బాగుంది.
తీర్పు :
మొత్తంగా నాగ చైతన్య, విక్రమ్ కుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ దూత వెబ్ సిరీస్ మిస్టరీ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. కథ పాతదే అయినప్పటికీ కూడా కథనాన్ని దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా నడిపిన తీరు బాగుంది. నటీనటుల పెర్ఫార్మన్స్, హై టెక్నీకల్ వాల్యూస్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫి వంటివి దీని ప్రధాన బలాలు. అయితే రన్ టైం పరంగా మాత్రం కొంత ఎక్కువనే అనిపిస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది.
మొత్తంగా ఈ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటిటి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటారని చెప్పవచ్చు.