Dabangg 3 2019 Bollywood Movie Review In Telugu

Dabangg 3

దబాంగ్ 3 మూవీ రివ్యూ ఆడియో – Dabangg 3 Movie Review Audio




 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ హీరోగా దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. దర్శకుడు ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏపీ, తెలంగాణల్లోని ముఖ్యమైన అన్ని చోట్లా హిందీ, తెలుగు రెండు వెర్షన్లు విడుదలయ్యాయి. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ధాకడ్‌ అలియాస్ చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌ఖాన్‌) వెరీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలాగే తన డ్యూటీనే అంతే పవర్ ఫుల్ గా చేస్తాడు. ఈ క్రమంలో అమ్మాయిలను బలవంతగా వ్యభిచారంలోకి దించుతున్న ముఠాని పట్టుకుని ఆ అమ్మాయిలను రక్షిస్తాడు. దాంతో ఆ ముఠాకి లీడర్, బిజినెస్ మెన్ అయిన బాలీ సింగ్ (సుదీప్‌)కు కోపం వస్తుంది. సల్మాన్‌ కి ఎదురు పడతాడు. అయితే వారిద్దరికీ గతంలో ఓ పగ ఉందని రివీల్ అవుతుంది. చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌) ప్రేమించిన ఖుషీ (సయీ) పాండేకి ఎలా దూరమైంది? దానికి బాలి సింగ్ ఎలా కారణమయ్యాడు? ఇంతకీ పాండేకి బాలీ సింగ్ కి మధ్య ఉన్న పగ ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ‘దబంగ్‌ 3’ని చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో సల్మాన్‌ అభిమానులు విజిల్స్ వేసేలా ఫుల్ యాక్షన్‌, అలాగే లవ్‌, రొమాన్స్‌ తో పాటు కామెడీ కూడా బాగుంది. సల్మాన్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ మెయిన్ గా ఆయన ఎంట్రీ సీన్‌ అదిరిపోయింది. చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్ చెప్పిన డైలాగులు కూడా చాల బాగున్నాయి. స్ట్రాంగ్ యాక్షన్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు ఫీల్ గుడ్ గా సాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక సల్మాన్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా తన సిక్స్ ప్యాక్ తో తన డాన్స్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

అలాగే విలన్ గా నటించిన సుదీప్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ కూడా బాగా అలరిస్తాయి. హీరోయిన్ గా నటించిన సోనాక్షి బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సయీ కూడా తన లుక్స్ అండ్ గ్లామర్ తో మెప్పిస్తోంది. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమాలో మాస్‌ కు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి.




మైనస్ పాయింట్స్ :

సినిమాలో కథ ఏమిలేదు. కొన్ని యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా ఫస్ట్ హాఫ్ లో ప్లాష్ బ్యాక్ స్టోరీ లీడ్ కు సరైన సీన్ కూడా లేదు. ప్లే కూడా స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు ఆ సీన్స్. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాలో అక్కడక్కడ ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా… దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. మెయిన్ గా స్టోరీ పాయింట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా (ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫీల్ తో ఎమోషనల్ గా సాగినప్పటికీ అది మినహా) దర్శకుడు మాత్రం సినిమాని ఆ దిశగా నడపలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు ప్రభుదేవా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ చాలా బాగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

దబాంగ్ సీరీస్ లో మూడో పార్ట్ గా వచ్చిన ఈ కామెడీ యాక్ష‌న్ డ్రామా.. స్ట్రాంగ్ యాక్షన్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, సెకెండ్ హాఫ్ స్లోగా బోర్ గా సాగడం, దర్శకుడు తీసుకున్న ఎమోషనల్ కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే సల్మాన్ అద్భుతంగా నటించి తన ఫ్యాన్స్ ను బాగా అలరించాడు. మరి ఈ డబ్బింగ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

English Review