Corona Virus 2020 Prevention And Treatment

కరోనా వైరస్ – నివారణ – ట్రీట్మెంట్

Coronavirus – Prevention – Treatment

ముందుగా ఇక్కడ చర్చిస్తున్న అన్ని విషయాలు నేను విన్న , చూసిన – డాక్టర్లు, నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు మాత్రమే, ఇక్కడ నా సొంత తెలివితేటలు ఏమీ లేవు.




కరోనా వైరస్ ( Covid – 19 )

1. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

2. ఇది పూర్తిగా 100% అంటువ్యాధి అంటే ఒక మనిషి నుంచి మరొక మనిషికి అతివేగంగా వ్యాపించగలదు.

3. ఇది ముక్కు లేదా కళ్ళు లేదా నోటి ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి, రోగ నిరోధక ( Immunity Power ) శక్తిని తీవ్రంగా దెబ్బతీసి చివరకు మరణానికి దారితీయగలదు.

4. దీని లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు. అయితే జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికీ ఈ వైరస్ వచ్చినట్టు కాదు, అది పరీక్షలు ద్వారా నిర్ధారణ అవుతుంది.

5. దీని లక్షణాలు బయటపడటానికి సుమారుగా 14 రోజులు పడుతుంది.

6. ఈ వైరస్ సుమారుగా గాలిలో 4 గంటలు, డబ్బు లేదా ఇతర కాగితాలపై 24 గంటలు, ప్లాస్టిక్ లేదా దుస్తుల పై నాలుగు రోజులు, రాగి పై 6 గంటలు, ఇతర లోహాలు పై ఒక రోజు నుండి ఐదు రోజుల వరకు జీవించ గలదు.

7. ఈ వైరస్ మానవ శరీరం పై కూడా 4 రోజులనుంచి 7 రోజుల వరకూ జీవించగలదు. అంటే చేతులు కాళ్లు ఇలా మానవ శరీరంపై ఎక్కడైనా ఈ వైరస్ జీవించగలదు.

8. ఈ వైరస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగానూ మరియు తొందరగా వ్యాపిస్తుంది కాబట్టి ఇ ఈ వైరస్ పగలు కంటే రేత్రి ఎక్కువగా వ్యాపిస్తుంది.

నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు




1. మన చేతులను, కాళ్లను ఎప్పటికప్పుడు శానిటైజర్లు లేదా సబ్బుతో కనీసం 30 సెకన్ల పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

2. ప్రతిరోజు శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించాలి ముఖ్యంగా కూరగాయలకు లేదా నిత్యావసరాలకు బయటికి వెళ్లి వచ్చిన వారు తప్పనిసరిగా స్నానం చేసి దుస్తులను మార్చుకోవాలి.

3. బయట నుంచి తెచ్చుకున్న కూరగాయలు లేదా పండ్లను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

4. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి అంతేకాకుండా బయటికి వెళ్లే వారు ఫేస్ మాస్క్ లను విధిగా ధరించాలి. ఫేస్ మాస్క్ లను ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి.

చికిత్స

1. దీనికి ఉన్న ఒకే ఒక చికిత్స మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే, ఎందుకంటే ఈ వైరస్ ని నాశనం చేసే ఏ మందు ఇంతవరకూ కనిపెట్టలేదు.

2. మన రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు విటమిన్ సి ( Vitamin C ), విటమిన్ బి6 ( Vitamin B6 ), విటమిన్ ఈ ( Vitamin E ), ఈ విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలు లేదా మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా లేదా ఈ వైరస్ బారిన పడిన వారు త్వరగా కోలుకునే విధంగా చేసుకోవచ్చు.

3. విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు – జామ, నిమ్మ, కమలా, ఉసిరి, నారింజ, మామిడి, బొప్పాయి వంటి పండ్లలో టమోటాలు, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, క్యాబేజి, కొత్తిమీర వంటి కూరగాయలలో సి విటమిన్ లభిస్తుంది.

4. విటమిన్ బి 6 లభించే ఆహార పదార్థాలు – చేపలు, చికెన్, మటన్ లివర్, అరటి పండ్లు, పిస్తా పప్పు, పాలకూర, బంగాళదుంపలు, క్యాబేజీ, పాలు, కోడి గుడ్లు వంటి ఆహార పదార్థాలలో బి 6 విటమిన్ లభిస్తుంది.

5. విటమిన్ ఈ లభించే ఆహార పదార్థాలు – బాదం పప్పు, బచ్చల కూర, మామిడి పండ్లు, బొప్పాయి వంటి ఆహార పదార్థాలలో ఈ విటమిన్ లభిస్తుంది

6. విటమిన్ టాబ్లెట్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా మన శరీరానికి అవసరమైన విటమిన్లను ఫుడ్ ద్వారా తీసుకోవడమే మంచిది.  కుదరక పొతే టాబ్లెట్స్ ద్వారా విటమిన్లను పొందవచ్చు

7. ఆవిరి పట్టడం – దీని గురించి మనందరికీ తెలుసు జలుబు, దగ్గు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే, చేసే మంచి చిట్కా, దీని వలన  మన శరీరం లో ఎన్నో వైరస్ లు నశిస్తాయి కరోనా ఉన్నా, లేకున్నా ఇప్పుడున్న పరిస్థితులలో రోజుకు 2 సార్లు ఆవిరి పట్టడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

8. ఒక పాత్రలో నీళ్లు పోసి ఆవిరి వచ్చే విధంగా బాగా మరిగించి దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టటం ఒక పద్దతి, లేదా మెడికల్ షాప్ లలో స్టీమ్ వ్యాపరైజర్లు దొరుకుతాయి వీటి ద్వారా ఆవిరి పట్టుకోవడం మరొక పద్దతి.

Steam

9. ఇక మెడిసిన్ విషయానికి వస్తే హైడ్రాక్సీక్లోరోక్విన్ ( Hydroxychloroquine ) టాబ్లెట్స్ వైరస్ కట్టడికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు వీటిని మలేరియా నివారణకు ఉపయోగిస్తారు.

         చివరిగా నేను అనుకుంటున్నది ఏంటేంటే – ఈ భూమి మీద పుట్టిన జంతువులు , పక్షులు, క్రిములు … ఇంకా ఇన్నో, వీటన్నిటికంటే మానవుడు ఎంతో గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో, కంటికి కూడా కనిపించని  ఒక చిన్న క్రిమి నువ్వెంత నీ బతుకెంత అని మొత్తం మానవ జాతికి సవాల్ విసురుతూ, ప్రపంచాన్ని వణికిస్తూ, కనీసం బయటకు అడుగు పెట్టనీయకుండా చేస్తున్న ఈ వైరస్ మానవుని అహం మీద దెబ్బ కొట్టింది అనే చెప్పాలి.