Bheemla Nayak 2022 Telugu Movie Review

Bheemla

భీమ్లా నాయక్ మూవీ రివ్యూ – Bheemla Nayak Movie Review

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీలో కరెక్ట్ గా ఉండే భీమ్లా నాయక్ కి ఎక్స్ ఎంపీ కొడుకు డేనియర్‌ శేఖర్‌ (రానా దగ్గుబాటి) పోలీసుల్ని కొట్టి అహంకారంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరుకుతాడు. ఈ క్రమంలో అహంకారం ఉన్న డేనియర్‌ శేఖర్‌ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న భీమ్లా నాయక్ కి మధ్య కొన్ని గొడవలు జరుగుతాయి. దీంతో ఇద్దరి మధ్య ఈగో క్లాష్ అవుతుంది. ఒకరి పై ఒకరు పై చేయి సాధించడానికి ఇద్దరు ఎంత దూరం వెళ్ళారు ? మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ? ఈ మధ్యలో సుగుణ (నిత్యా మీనన్) పాత్ర ఏమిటి ? చివరకు డేనియర్‌ శేఖర్‌ – భీమ్లా నాయక్ ఎలా కలిశారు ? దానికి కారణమైన వ్యక్తి ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో, పవర్ ఫుల్ ఎమోషన్స్ తో మరియు భారీ తారాగణంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పవన్ ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు పవన్. తన పరిపక్వతమైన నటనతో పవన్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన రానా కూడా చాలా బాగా నటించాడు. పవన్ కి పోటీగా ధీటుగా రానా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తమ నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. స్క్రీన్ ప్లే రచయిత త్రివిక్రమ్ ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం బాగా ఆకట్టకుంది.

మెయిన్ గా పవన్ – రానా మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అలాగే మిగిలిన నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :




హై యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా చాల వరకు ఆకట్టుకున్నా.. కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ తో ప్లేని రాసుకున్నా.. దాన్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. పైగా పవన్ కళ్యాణ్ మార్క్ ను ఎక్కువుగా ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం అక్కడక్కడ కొంతవరకు నిరాశ తప్పదు.

ఇక ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్ ను, మధ్యలో కొన్ని చోట్ల ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్సెస్ ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. సంయుక్త మీనన్ పాత్రకి – పవన్ పాత్రకి పెట్టిన లింక్ కూడా పూర్తి సినిమాటిక్ గా ఉంది. ఆమె చివర్లో చెప్పే పాయింట్ ఏదో.. మొదట్లోనే చెప్పి ఉంటే.. ఇంత గొడవ జరిగేది కాదు కదా అని ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో, పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పవన్ కళ్యాణ్ – రానా బలమైన స్క్రీన్ ప్రెజన్సీతో ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంది. అయితే, అక్కడక్కడ స్లోగా సాగే సీన్స్, కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ పవన్, రానా ల డాషింగ్ అండ్ డైనమిక్ పెర్ఫామెన్స్ లు బాగా అలరిస్తాయి. మొత్తానికి ఈ చిత్రం ఇరు హీరోల అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి ఎమోషల్ యాక్షన్ ట్రీట్ లా అనిపిస్తోంది.

English Review