Aladdin 2019 Hollywood Movie Review In Telugu

Aladdin

అల్లాద్దీన్‌ మూవీ రివ్యూ ఆడియో – Aladdin Movie Review Audio




 

డైరెక్ట‌ర్ ‘గై రిట్‌చ్చి’ దర్శకత్వంలో వస్తోన్న మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ అమెరిక‌న్ చిత్రం ‘అల్లాద్దీన్‌’. ఈ చిత్రంలో విల్ స్మిత్‌, మీన మసూద్‌, సీమ్‌పెడ్రాడ్‌, న‌మి స్కోట్ త‌దిత‌రులు నటించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఇక కథ విషయానికి వస్తే తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకుని పేదరికంలో బతుకుతూ.. అందరీ చేత బేవర్స్ అనిపించుకుంటుంటాడు అలాద్దీన్‌ (మీన మసూద్‌). ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాలు అంతరం అల్లాద్దీన్ కి యువరాణి జాస్మిన్ (నయోమి స్కాట్‌) పరిచయం అవుతుంది. వారి మధ్య జరిగిన కొని సంఘటనలతో ఇద్దరికీ ఒకరి పై ఒకరికి ఆకర్షణ కలుగుతుంది. అయితే జాస్మిన్ రాజ్యంలోని జాఫర్ అనే క్రూరుడు ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ద్విపంలో ఉండే జీని కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘనల తరువాత ఆ ద్విపం అలాద్దీన్ కి దొరుకుంతుంది. దాంతో అలాద్దీన్ ఏం చేసాడు ? చివరికి యువరాణి జాస్మిన్ ఎలా పొందాడు ? ఈ క్రమంలో అతనికి ఎదురైనా సమస్యలు ఏమిటి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ కథని ఎన్ని సార్లు సినిమాగా తీసిన, చూసిన ప్రతి సారి కొత్తగానే ఉంటుంది. కారణం అత్యంత అద్భుతమైన విజువల్స్ అని చెప్పాలి. డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికని వాడుకొని, అల్లాద్దీన్ కథని ఓ విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు అరేబియన్ రాజ్యంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి కారణం భారీ బడ్జెట్ తో అల్లాద్దీన్ కి జోడించిన సరికొత్త హంగులే . ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అద్భుతంగా నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ కూడా చాలా బాగా యాక్ట్ చేసాడు. ప్రిన్స్‌ జాస్మిన్‌ గా నయోమి స్కాట్‌ చాలా బాగా నటిచింది.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వగా.. అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ డబ్బింగ్ సినిమాలో ఆ టైపు కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌ తో మాడ్యులేషన్ తో మరోసారి ఈ సినిమాకే తన టైమింగ్ తో హైలెట్ గా నిలిచారు.

‘అలాద్దీన్‌’ డైరెక్ట‌ర్ ‘గాయ్‌ రిట్చయ్‌’ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. అద్భుతమైన విజువల్స్ తో సినిమాను మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ చిత్రంగా మలిచారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ‘గై రిట్‌చ్చి’ లవ్ స్టోరీతో మరియు జీని మాయలతో ఫస్టాఫ్ ను ఆసక్తికరంగా కాస్త కామెడీగా గా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. స్లోగా సాగే సీన్స్ తో పాటు అలాగే అర్ధం కాని పాటలతో కొంత ఇబ్బంది పెడుతుంది.. పైగా ఆ పాటలు అర్ధం కాక కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.

తీర్పు :

‘గై రిట్‌చ్చి’ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ చిత్రం అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ తో మరియు కొన్ని లవ్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే స్లోగా సాగే సీన్స్ తో పాటు అలాగే అర్ధం కాని పాటలతో కొంత ఇబ్బంది పెడుతుంది ఈ చిత్రం. కానీ సినిమాలో కంటెంట్ తో పాటు విజువల్స్ బాగా అలరిస్తాయి. ఓవరాల్ గా ‘అల్లాద్దీన్‌’ మంచి విజువల్ ట్రీట్ ఇస్తోంది.

Release date : 24 May 2019

Teluguprazalu.com Rating : 3.25/5

Starring : Mena Massoud, Will Smith, Naomi Scott

Director :  Guy Ritchie

Producers :Dan Lin, Jonathan Eirich

Music Director : Alan Menken

Cinematographer : Alan Stewart

Editor : James Herbert




Aladdin is one of the most awaited films in recent times and it has created a big craze in Telugu states as the F2 combo, Venkatesh and Varun Tej have dubbed for main characters in the film. We have been to the Telugu version and bring you the review in detail.

Story : 

As we all know the film is a live adaptation of Disney’s animated classic Aladdin from 1992. The film is based in the kingdom of Agrabah where a small thief Aladdin(Aladdin (Mena Massoud) falls in love with its princes’ Jasmine(Naomi Watt). He tries hard to woo her but the evil chief advisor to the Sultan of Agrabah puts forward a condition to Aladdin that he brings the magical lamp along with its Genie(Will Smith) which grants the three magical wishes. Rest of the story is as to how Aladdin brings Genie to life and takes his help in winning the love of Jasmine.

Plus Points : 

One of the biggest plus points is undoubtedly Will Smith’s performance. He as the Genie is magical, funny and full of life. Will Smith’s body language as the Genie is top notch and the spectacular special effects done on him makes his role look even more interesting. His chemistry with Aladdin played by Mena Massoud is superb in the film.

Speaking of Mena Massoud, the young actor has given his best as Aladdin. Initially, he looks a bit lost in the film but as the story moves ahead, he is great to watch on screen. Naomi Watt is a dream and looks gorgeous. She is top notch as the Arabian princess and gives a sensible performance.

The love story between Aladdin and Jasmine has been showcased on a sensible note. The visual effects need a special mention as the Arabian world has been created on a spectacular note. All the scenes which showcase the magical carpet flying with Aladdin and Genie’s special powers have been created amazingly.

Minus Points :

The biggest drawback in the film are the songs. Strangely, too many musical bits have been included in the film which irritates after a point. As the songs are dubbed in Telugu, the pain is even more.

Both the first and second half start on a slow note. The climax is satisfactory but some more action or visual effect scenes would have made a lot of difference. The villain played by Marwan Kenzari is not that great and a more powerful villain could have made things more interesting.

Technical Aspects :

The background score is pretty good and has a lot of Indian touch. So, most of the time you feel as if you are watching an Indian film with good production values. Dubbing done for the Telugu version is perfect. Venkatesh and Varun Tej’s voices enhance the viewing experience in a big way. VFX is superb and makes the film look amazing in several scenes. All the special powers and how they are executed through Will Smith have been showcased in a superb manner.

Coming to the director Guy Ritchie, he has adapted the animated classic on a decent note but adds a lot of drama which was not necessary for many areas. There are a lot of wow moments which will be loved by the kids and the director has succeeded in this department. But if he would have avoided the song bits and added more action in the climax, the output would have been even more stunning.

Verdict :

One the whole, Aladdin is an extravagant fantasy drama which has some spectacular visual effects and thrills. But the presence of excess songs and a bit dragged second half are some de-merits. If you ignore all this and want to see how the famous fantasy story of your childhood is given life  with today’s technology, you need to watch the film on the big screen to enjoy the ride. As the film is dubbed on a good note in Telugu, the kids and general will like the film even more.