ఛాంగురే బంగారు రాజా మూవీ రివ్యూ – Changure Bangaru Raja Movie Review
హీరో రవితేజ ఇప్పుడు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి పలు చిత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి తన నిర్మాణం నుంచి యంగ్ నటీనటులతో వచ్చిన తాజా చిత్రమే “ఛాంగురే బంగారు రాజా”. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే..బంగార్రాజు(కార్తీక్ రత్నం) ఓ బైక్ మెకానిక్ కాగా నర్సీపట్నం దుగ్గాడ ప్రాంతంలో ఉంటాడు. అయితే ఈ ప్రాంతంలో కొన్ని రంగు రాళ్లు దొరుకుతాయని ప్రసిద్ధి. అయితే బంగార్రాజుకి సోము నాయుడు(రాజ్ తిరందాసు) అనే వ్యక్తికి మధ్య చిన్న ఘర్షణ అనంతరం సోము నాయుడు అనుమానాస్పదంగా హత్యకి గురవుతాడు.
సో ఇది కాస్తా బంగార్రాజు అరెస్ట్ వరకు వెళ్తుంది. మరి ఈ కేసు నుంచి అయితే బంగార్రాజు బయట పడతాడా పడితే ఎలా పడతాడు అలాగే తాతారావు(సత్య) లాఫ్ గీతులు(రవి బాబు) లకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కనిపించే థీమ్ అయితే కాస్త ఆసక్తిగానే ఉంది. అలాగే నటుడు కార్తీక్ రత్నం సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే తన డైలాగ్ డెలివరీ కానీ నాచురల్ పెర్ఫామెన్స్ లు అయితే ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా బాగుంది.
అలాగే సెకండాఫ్ లో అయితే వచ్చే రవిబాబు ఎంట్రీ అక్కడ నుంచి సినిమాలో ఫన్ అయితే మరింత జెనరేట్ అవుతుంది. అలాగే తాను తన రోల్ ని ఎప్పటిలానే మంచి కామికల్ టైమింగ్ తో ఇంప్రెస్ చేశారు అలాగే తనతో పాటుగా మిగతా కనిపించిన కొందరు నటులు డీసెంట్ పెర్ఫామెన్స్ లతో తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ఉండే థీమ్ ఎంతవరకు బాగుంది అనిపిస్తుందో దానిని అయితే సరైన నరేషన్ ఇవ్వకుండా కంప్లీట్ డిజప్పాయింట్ చేసారని చెప్పాలి. డైరెక్టర్ మాత్రం ఈ విషయంలో చాలా డిజప్పాయింటింగ్ వర్క్ ని అందించాడు.
అలాగే ఈ చిత్రంలో లాగ్ అనిపించే సీన్స్ కూడా చాలా ఉన్నాయి దీనితో ఈ చిత్రం మరింత బోరింగ్ గా అనిపించింది. అలాగే గోల్డి నిస్సి, నిత్యా శ్రీ లాంటి ఇతర నటుల్ని ఇంకా మంచి క్యారక్టరైజేషన్ ని డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే నటుడు సత్య కామెడీ టైమింగ్ ని ఇంకా పలు సీన్స్ లో వినియోగించుకునే స్కోప్ ఉంది. కానీ దానిని వాడుకోలేదు. అలాగే సినిమాలో ఓ సాంగ్ కూడా అంత ఎఫెక్టీవ్ గా అనిపించదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రానికి రవితేజ అందించిన నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక ఈ చిత్రం టెక్నీకల్ టీం లో కృష్ణ సౌరబ్ ఇచ్చిన సంగీతం బాగుంది. అలాగే సుందర్ ఎన్ సి సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ వర్మ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు సతీష్ వర్మ విషయానికి వస్తే తాను రాసుకున్న కథ కొన్ని సీక్వెన్స్ లు బాగున్నాయి కానీ దర్శకునిగా మాత్రం తాను విఫలం అయ్యాడు. చాలా డిజప్పాయింటింగ్ వర్క్ ని అయితే ఈ విషయంలో అందించాడు. మెయిన్ గా స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ గా మలచడం తాను సక్సెస్ కాలేదు. తాను తీసుకున్న కాన్సెప్ట్ కి ఇది కానీ సెట్ అయ్యి ఉంటే సినిమా ఫలితం ఇంకోలా ఉండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “చాంగురే బంగారు రాజా” చిత్రంలో నటుడు కార్తీక్ రత్నం ఇంప్రెసివ్ వర్క్ ని కనబరిచాడు. అలాగే అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. దర్శకుడు మరికాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా అవుట్ పుట్ మరింత మెరుగ్గా వచ్చి ఉండేది. దీనితో ఈ వారాంతానికి అయితే ఈ సినిమా తక్కువ అంచనాలు పెట్టుకొని ఓసారి ట్రై చేస్తే చేయవచ్చు.