Acharya 2022 Telugu Movie Review

Acharya

ఆచార్య మూవీ రివ్యూ – Acharya Movie Review

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఆచార్య’. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :




ధర్మస్థలంలో అధర్మం రాజ్యం వెళ్తున్న క్రమంలో ఆచార్య (చిరంజీవి) అక్కడకి వస్తాడు. ఎంతో ప్రసిద్ది గాంచిన ధర్మస్థలి అప్పటికే బసవ(సోనూసూద్‌) చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బసవ మరియు అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా అరికట్టాడు? అసలు ఆచార్యకి ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏమిటి? ధర్మస్థలిలో నీలాంబరి (పూజా హెగ్డే) ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది? ధర్మస్థలి పక్కనే ఉన్న పాద ఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ద (రామ్‌ చరణ్‌) ఏమైపోయాడు? అసలు సిద్ధ ఎవరు? సిద్ధాకి ఆచార్యకి మధ్య ఉన్న బంధం ఏమిటి? చివరకు ఆచార్య ధర్మస్థలిలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ అంచనాలతో భారీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన ఎమోషన్స్ తో, విజువల్స్ తో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. మెగాస్టార్ చిరంజీవి తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. మరో కీలక పాత్ర సిద్ధగా కనిపించిన చరణ్ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ.

చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ కి అతి పెద్ద విందు భోజనం. పైగా చిరు – చరణ్ పాత్రల మధ్య జర్నీ అండ్ ఎలివేషన్స్ అద్భుతంగా అనిపించాయి. అలాగే చరణ్ క్యారెక్టర్ లోని షేడ్స్ చాలా బాగున్నాయి. ఇక చరణ్ సరసన కథానాయకగా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. చరణ్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఇక సినిమాలో నాజ‌ర్, అజ‌య్, త‌నికెళ్ల భ‌ర‌ణి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అదేవిదంగా మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్‌, చరణ్, చిరంజీవి నక్సలైట్లుగా కనిపించే విజువల్స్ మరియు క్లైమాక్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్ :




భారీ అంచనాలతో వచ్చిన ఈ మెగా హై ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్, బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని సన్నివేశాల సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

దర్శకుడు కొరటాల శివ సినిమాను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల సినిమాని బాగా నెమ్మదిగా నడిపారు. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ బాగా రొటీన్ గా సాగాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. 90 కాలం నాటి వెరీ రెగ్యులర్ మేకింగ్ స్టైల్ తో ఆ సన్నివేశాలు ఉన్నాయి. మొత్తమ్మీద మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది. కానీ అలా లేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. మణిశర్మ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ భారీ మెగా ఎమోషనల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్.. ఆ అంచనాలను అందకోలేక పోయింది. కాకపోతే, మెయిన్ కథాంశం, చిరు – చరణ్ ల నటన, వీరు కలిసి సాగిన సన్నివేశాలు, మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ స్క్రీన్ ప్రేజన్సీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, రొటీన్ సీన్స్ తో స్లోగా సాగే ప్లే, అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్, ఇక బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్.. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

English Review