Sulthan 2021 Telugu Movie Review

Sulthan

సుల్తాన్ మూవీ రివ్యూ – Sulthan Movie Review

“ఖైదీ” సినిమాతో ఒక్క తమిళ్ లోనే కాకుండా మన తెలుగులో కూడా మంచి కం బ్యాక్ అందుకున్న హీరో కార్తీ ఇప్పుడు మళ్ళీ “సుల్తాన్” గా వచ్చాడు. రష్మికా మందన్నా హీరోయిన్ గా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ నడుమ రెండు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :




ఇక కథలోకి వెళ్లినట్టు అయితే విక్రమ్ సుల్తాన్(కార్తీ) ముంబైలో రోబోటిక్ ఇంజినీర్ గా పని చేస్తూ వైజాగ్ లో ఉండే తన తండ్రి సేతుపతి(నెపోలియన్) తదనంతరం వారు ఎప్పటి నుంచో చూసుకుంటున్న కౌరవులుగా పిలవబడే 100 మంది కోడి పందాలు చేసే వారిని చూసుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ నుంచి సుల్తాన్ అమరావతిలోని వెలగపూడి అనే గ్రామంలో రుక్మిణి(రష్మికా మందన్నా) ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అదే రుక్మిణి ఉన్న గ్రామానికి ఓ అనుకోని పెద్ద సమస్య ఉందని తెలుసుకుంటాడు. మరి ఆ ఊరికి వచ్చిన అతి పెద్ద సమస్య ఏంటి? అందుకు కారణం ఎవరు? ఈ 100 మంది కౌరవులు ఎవరు? కార్తీ తన కౌరవులతో ఏం చేసాడు? ఆ ఊరిని కాపాడగలిగాడా లేదా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే కార్తీ తన గత సినిమాల కంటే కూడా మంచి గ్లామరస్ గా కనిపిస్తాడు. అంతే కాకుండా ఎప్పటిలాంటి తన నటన కానీ డైలాగ్ మాడ్యులేషన్ కానీ బాగున్నాయి. అయితే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో కార్తీని మంచి స్టైలిష్ గా చూపించిన విధానం బాగుంది. అలాగే తనలోని ఫన్ యాంగిల్ కూడా ఈ సినిమాలో మరోసారి బాగా కనిపిస్తుంది.

ఇక రష్మికా మందన్నా విషయానికి వస్తే ఓ పల్లెటూరి అమ్మాయిలా రష్మికా మంచి నాచురల్ గా కనిపిస్తుంది. ఆ నేటివిటీకి తగ్గట్టుగా తన రోల్ లో రష్మికా బాగా చేసింది. అలాగే కార్తీకి తనకి మంచి కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో పలు చోట్ల కనిపించే స్ట్రాంగ్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి ముఖ్యంగా మన్సూర్ ఆ 100 మంది కౌరవుల సీక్వెన్స్ పాయింట్ బాగుంది. వీటి అనుసారం వచ్చే యాక్షన్ మంచి మాస్ అండ్ మసాలాగా అనిపిస్తుంది.

అలాగే ఆద్యంతం పల్లెటూరి నేపథ్యంలో కనిపించే విజువల్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇంపుగా ఉంటాయి. వీటితో పాటుగా అక్కడక్కడా ఉండే కామెడీ ఎపిసోడ్స్ కూడా మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. అలాగే విలన్ రోల్ లో కనిపించిన కేజీయఫ్ ఫేమ్ రామ్ మంచి విలనిజం అవసర సన్నివేశాల్లో బాగా చూపించాడు. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా మంచి నటనను కనబరిచాడు. ఇక యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :




ఈ సినిమా చూస్తున్నంతసేపు మొదటి డ్రా బ్యాక్ గా అనిపించేది ఏమన్నా ఉంది అంటే సినిమా బాగా లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నిడివి ఎక్కువ కావడంతో పార్టులుగా ఓకే అనిపించినా కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కథ కూడా అంతగా కొత్తదనం ఉన్నట్టు అనిపించదు. రొటీన్ బ్యాక్ డ్రాప్ నే నేటి తరానికి కావాల్సిన అంశాలు పెట్టి చూపించినట్టు అనిపిస్తుంది.

అలాగే మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే కేజీయఫ్ ఫేమ్ రామ్ లాంటి స్టార్ విలన్ ను ఇతర కొంత మంది పవర్ ఫుల్ విలన్స్ ను పెట్టుకొని కూడా వారిని అవకాశం ఉన్నా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చెయ్యకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లలో లాజిక్స్ కూడా క్లారిటీ గా ఉండవు. ఇవే ఈ చిత్రంలో మెయిన్ డ్రా బ్యాక్స్ గా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఇది వరకే కార్తీ పలు సినిమాలకు నిర్మాణం వహించిన డ్రీం వారియర్ వారి నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉంటాయి. ఈ చిత్రంలో మొదటి ఫ్రేమ్ నుంచీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మంచి రిచ్ గా అనిపిస్తాయి.

తెలుగు డబ్ వర్క్ కూడా బాగుంది. అలాగే టెక్నీకల్ టీం విషయానికి వస్తే సత్యన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా నేపథ్యానికి తగ్గట్టు డీసెంట్ గా అనిపిస్తుంది.అలాగే యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచి ఫ్రెష్ గా సీన్స్ కి తగ్గట్టు ఉంటుంది. అలాగే వివేక్ – మెర్విన్ ల సాంగ్స్ బాగున్నాయి. అయితే రూబెన్ ఎడిటింగ్ బెటర్ గా ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు బక్కియరాజ్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. కానీ దానికి ఇచ్చిన డెవలప్మెంట్ బాగుంది. నరేషన్ లో మంచి యాక్షన్ కామెడీ సహా రాసుకున్న స్ట్రాంగ్ ఎమోషన్స్ బాగా ఎలివేట్ అవుతాయి. కాకపోతే ఎక్కువ డ్రామా పెట్టేసారు కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి ఇంకాస్త ఎంగేజింగ్ గా తీసి ఉంటే బాగుండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘సుల్తాన్’ లో కార్తీ మరియు రష్మికాల పెర్ఫామెన్స్ లు ప్రామిసింగ్ గా ఉంటాయి. ఓ రకంగా కార్తీ రోల్ మంచి పవర్ ఫుల్ గా మాస్ ఆడియెన్స్ ను అలరించే విధంగా సాలిడ్ గా ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ ఎమోషన్స్ బాగుంటాయి. కాకపోతే దర్శకుడి కథ పాతగానే ఉన్నా ప్రెజెంటేషన్ లో రాసుకున్న ఎపిసోడ్స్ బాగుంటాయి. కానీ విలన్స్ ను స్ట్రాంగ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా మంచి ఎమోషన్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ మాత్రం కావాలి అనుకునే వారికి ఈ వారాంతంలో సుల్తాన్ ఓసారి చూసేందుకు ఛాయిస్ గా నిలుస్తుంది.

English Review