Wild Dog 2021 Telugu Movie Review

Wild

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ – Wild Dog Movie Review

కింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. అహిషోర్ సాలొమోన్ దర్శకత్వంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

క‌థ :




విజ‌య్ వ‌ర్మ (అక్కినేని నాగార్జున) ఎన్ఐఏ ఆఫీసర్. ఎన్ కౌంటర్లలో స్పెషలిస్ట్ అయిన విజయ్ కి డిపార్ట్మెంట్ లో వైల్డ్ డాగ్ అనే మరో పేరు కూడా ఉంటుంది. అయితే హైద‌రాబాద్ గోకుల్ ఛాట్ బాంబుపేలుడు, అలాగే ఆ తరువాత దేశంలో జరిగిన కొన్ని బ్లాస్ట్ సంఘటనలకు కారణమైన ఖాలీద్ అనే టెర్రరిస్ట్ ను పట్టుకోవడానికి విజయ్ అండ్ అతని టీమ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? ఈ క్రమంలో ఖాలీద్ ఎలా తప్పించుకుని నేపాల్ వెళ్ళాడు ? అతన్ని నేపాల్ నుండి పట్టుకుని ఇండియాకి తీసుకురావడానికి విజయ్ టీం ఏమి చేశారు ? వాళ్ళ ఆపరేషన్ వైల్డ్ డాగ్ ఎలా సాగింది ? చివరకు విజయ్ వర్మ అండ్ టీమ్ ఖాలీద్ ను పట్టుకున్నారా? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

వైల్డ్ డాగ్ విజయ్ వర్మగా ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నాగ్ అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. నాగ్ టీమ్ లోని మెంబర్స్ కూడా చాలా బాగా నటించారు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ లోనూ వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

నేపాల్ లో రా ఏజెంట్ గా స‌యామీ ఖేర్‌ బాగా ఫిట్ అయింది. యాక్షన్ సీన్స్ లోనూ సయామీ ఎనర్జిటిక్ గా నటించింది. ఇక భార్య పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే దియామీర్జా నటన కూడా పరవాలేదనిపిస్తోంది. అలాగే నాగ్ చనిపోయిన తన కూతురితో వచ్చే భావోద్వేగ సీన్స్ కూడా బాగున్నాయి.

ఖాలీద్ పాత్రలో నటించిన నటుడు ఆ పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

దర్శకుడు సాలోమ‌న్‌ రాసిన ఈ చిత్ర కథలోని మెయిన్ పాయింట్ ఆకట్టుకుంటుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెస్తాయి.

మైనస్ పాయింట్స్ :




ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగాలి. ఈ కథలో అది కూడా మిస్ అయింది. దర్శకుడిగా సాలోమ‌న్‌ మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు హిందీ వెబ్ సిరీస్ లు గుర్తుకువస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే.. సినిమాలో ఎక్కువ భాగం ఇన్విస్టిగేషన్ సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ సినిమాకి మరో బలహీనత.

సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకున్నే యాక్షన్ తప్ప.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…థమన్ అందించిన సంగీతం అయన స్థాయికి తగ్గట్టు లేదు. కానీ ఆయన అందించిన నేపధ్య సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది.

సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా కెమెరామెన్ దృశ్యాలని తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

వైల్డ్ డాగ్ అంటూ వచ్చిన ఈ సినిమాలో ఇంట్రెస్ట్ గా సాగే ట్రీట్మెంట్ తో పాటు కొన్ని ఇన్విస్టిగేషన్ తో సాగే సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నాగార్జున నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఆసక్తికరంగా ఇన్వెస్ట్ గెట్ చేసే సీన్స్ రాసుకున్నే స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు సాలోమ‌న్‌ మాత్రం ఆ సన్నివేశాలను సాధారణ రైటింగ్ తోనే సినిమాని నడిపించారు. ఇక నాగ్ టీమ్ మెంబర్స్ పెర్ఫామెన్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా నాగ్ అభిమానులకు చాల బాగా నచ్చుతుంది.

English Review