అరణ్య మూవీ రివ్యూ – Aranya Movie Review
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
అరణ్య (రానా) లక్ష మొక్కలు నాటి రాష్ట్రపతి చేతుల మీదగా ఫారెస్ట్ మ్యాన్ అవార్డ్ అందుకున్న అడవి ప్రేమికుడు అని అలాగే ఏనుగుల నాయకుడు అని. ప్రేమ కోసం, రైతుల కోసం, సమాజం కోసం, ఇలా రకరకాల సమస్యల పై పోరాటం సాగించే సినిమా కథలు ఇప్పటికే చాల వచ్చాయి ? అయితే, ఈ సినిమా కథ ఏనుగుల బతుకు కోసం చేసిన పోరాటానికి సంబధించింది. అసలు ఇంతకీ ఏనుగులకు వచ్చిన సమస్య ఏమిటి ? ఆ సమస్యను అరణ్య’ ఎలా పరిష్కరించాడు ? ఈ మధ్యలో అతను అనుభవించిన కష్టాలు అవమానాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ కథ జరిగిన నేపధ్యమే ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నంత సేపు అడవిలోకి వెళ్లి ఆ పాత్రలను, వాటి సమస్యలను మనకు దగ్గరనుండి చూపించిన ఫీలింగ్ కలిగించాడు దర్శకుడు. అలాగే విష్ణు విశాల్ సున్నితమైన ప్రేమ కథ కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. అన్నిటికి అంటే ముఖ్యంగా రానా భావోద్వేగమైన పాత్రలో బరువైన ఎమోషన్ పండించిన విధానం అబ్బురపరుస్తుంది.
అలాగే ప్రధానంగా సాగే కథ కూడా ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తోంది. వీటితో పాటు దర్శకుడి టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. ఇక కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటూనే, ప్రతి పాత్ర అర్ధవంతగా సాగడం బాగుంది.
ఇక దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమా చివరకి వచ్చేసరికి ఏనుగులకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి ఫీల్ తో కూడుకున్న అనుభూతి కలుగుతుంది. నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్.
మైనస్ పాయింట్స్ :
ఎమోషనల్ గా సాగే విజువల్స్ తో సినిమా ఆకట్టుకున్నా.. కథనం పరంగా ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో బాగానే చూపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడ అనవసరమైన విష్ణు విశాల్ లవ్ ట్రాక్ నడిపి సినిమాలోని సీరియస్ నెస్ మరియు సినిమా ప్లోను డిస్ట్రబ్ చేస్తోంది. పైగా విష్ణు విశాల్ క్యారెక్టర్ సరైన ముగింపు కూడా లేదు.
దాంతో స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి.
ముఖ్యంగా కొన్ని సీన్స్ ను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అలాగే మధ్యమధ్యలో వచ్చే లాజిక్ లేని మినిష్టర్ ట్రాక్ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు దర్శకత్వ విషయంలో ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. అయితే రచయితగా మాత్రం ఆయన విఫలం అయ్యారు. ఎమోషన్ అండ్ ఫీల్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను మాత్రం దర్శకుడు తయారుచేయలేకపోయారు. సంగీత దర్శకుడు శాంతను అందించిన నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించిన రానాను అభినందించి తీరాలి.
తీర్పు :
వైవిధ్యమైన విజువల్ కంటెంట్ తో ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘అరణ్య’ చిత్రంలో రానా నటన, ఆహార్యం, అలాగే రానా వాయిస్ మరియు ఈ సినిమా మెయిన్ థీమ్ మరియు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే, సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాల స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు అంత బాగా నచ్చకపోవచ్చు.