సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ – Solo Brathuke So Better Movie Review
ఫైనల్ గా చాలా కాలం అనంతరం ఓ చెప్పుకోదగ్గ సినిమాతో థియేటర్స్ లో మళ్ళీ సందడి వాతావరణం మొదలయ్యింది. అదే సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. మంచి అంచనాలు అలాగే నిబంధనలతో నేడు విడుదల కాబడ్డ ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
తన జీవితంలో అసలు పెళ్లి అనే కాన్సెప్టునే లేకుండా సోలో లైఫ్ బెటర్ అని జీవిస్తుంటాడు (విరాట్)సాయి ధరమ్ తేజ్. తన మావయ్య రావు రమేష్ నుంచి నేర్చుకున్న ఫిలాసఫీని చాలా బలంగా నమ్మే తేజ్ కొన్ని పరిణామాల రీత్యా పెళ్లి చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోతాడు. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న తేజ్ పెళ్లి వరకు ఎలా వెళ్లాల్సి వచ్చింది? అతడు ఎంచుకున్న మార్గం వల్ల ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో గా కనిపించిన అమృత(నభా నటేష్) ఎలాంటి రోల్ పోషించింది. ఫైనల్ గా ఈ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సుఖాంతం అయ్యిందా లేదా అన్నది తెలియాలి అంటే థియేటర్స్ వరకు వెళ్లి ఈ సినిమాను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఇక ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్ కోసం చెప్పుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ ట్రాక్స్ హిలేరియస్ గా అనిపిస్తాయి అలాగే కథానుసారం వచ్చే ఈ ఎపిసోడ్స్ థియేటర్ లో ఆడియెన్స్ ను మెప్పిస్తాయి. అలాగే అక్కడక్కడా చోటు చేసుకునే చిన్న చిన్న ట్విస్టులు కూడా మంచి రీజనబుల్ గా మరియు డీసెంట్ గా అనిపిస్తాయి.అలాగే ఆడియో ఇప్పటికే హిట్ అవి విజువల్ గా మరింత అందంగా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.
ఇక నటీ నటుల విషయానికి వస్తే హీరో సాయి తేజ్ ప్యూర్ సింగిల్ రోల్ వరకు సూపర్బ్ గా చేసాడు అని చెప్పాలి. అలాగే కామెడీని అయితే పర్ఫెక్ట్ గా పండించాడు. అంతే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే ముందు సినిమాల కంటే తన నటనలో మరింత మెరుగు కనిపిస్తుంది. వీటితో పాటుగా తన డాన్స్ మూమెంట్స్ కానీ ఫైట్స్ లో తన సాలిడ్ పర్శనాలిటీతో తేజ్ చాలా సెటిల్డ్ గా కనిపిస్తాడు.
ఇక యంగ్ యాక్ట్రెస్ నభా నటేష్ విషయానికి వస్తే ఆమె ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయమే పట్టినా తన రోల్ ను చాలా బాగా చేసింది మంచి నాచురల్ లుక్ తో మెరుగైన నటనను కూడా కనబర్చి తన నటనకు మంచి స్కోప్ ను ఈ చిత్రంలో చూపింది. ఇక సీనియర్ నటులు నరేష్ రావు రమేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు అత్యుత్తమ నటనను కనబర్చారు. రావు రమేష్ అయితే తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకుంటారు. లాస్ట్ టైం కూడా సాయి తేజ్ మరియు ఈయన మధ్య మంచి కామెడీ చూసాము ఇందులో ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక భాద్యతాయుతమైన రోల్ లో కనిపించి ఆకట్టుకుంటారు.
మైనస్ పాయింట్స్ :
ట్రైలర్ చూసాక ఈ క్రిస్మస్ కు మంచి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలుస్తుందని చాలా మంది గట్టిగా ఫిక్స్ అయ్యారు. కథను పక్కన పెట్టినా మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అని అనుకున్న ఈ సినిమాలో కొన్ని సిల్లీ లాజిక్స్ కనిపిస్తాయి. డీసెంట్ గా పర్వాలేదు అనిపించే ఫస్ట్ హాఫ్ అయ్యాక సెకండాఫ్ లో మంచి కామెడీ జెనరేట్ అయినా అవి అంతగా వర్కౌట్ అయ్యినట్టుగా అనిపించవు.
సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ సెకండాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా ఆసక్తిని పోగొడతాయి, దానికి మరో కారణం సినిమా రొటీన్ గానే అనిపిస్తుంది అని భావన కలగడం. ఈ విషయంలో జాగత్త వహించి ఉండాల్సింది. అలాగే హీరో యాంగిల్ లో పెళ్లి అనే కాన్సెప్ట్ ను ఇంపార్టెంట్ అనేది ఎలా చూపించారో అలా హీరోయిన్ విషయంలో దర్శకుడు దృష్టి పెట్టలేదో అర్ధం కాదు.
పైగా హీరోయిన్ రోల్ ను డిజైన్ చేసిన విధానం దానిని ఎస్టాబ్లిష్ చెయ్యడంలో కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య మరిన్ని సీన్స్ అంటే రొమాంటిక్, కెమిస్ట్రీ తరహా సీన్స్ ను యాడ్ చేసి ఉంటే మరింత ఇంపుగా అనిపించి ఉండేది. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ లో ఇంకా ఏమన్నా డ్రామా ఉంటుందా అనుకునే దానిని కూడా చాలా త్వరగానే ముగించేసినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణుల్లో మొదట చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్న థమన్ కోసమే మాట్లాడాలి. థమన్ ఈ సినిమాకు మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. మంచి పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించి కీలక పాత్ర పోషించాడు. కెమెరా పనితనం కానీ ఎడిటింగ్, లిరిక్స్ విజువల్ అత్యున్నత స్థాయిలో కనిపిస్తాయి వీటిలో నిర్మాణ విలువలు క్లియర్ గా కనిపిస్తాయి.
ఇక యంగ్ దర్శకుడు సుబ్బు విషయానికి వస్తే ట్రైలర్ తోనే మినిమం హోప్స్ ను తనపై తెచుకోగలిగాడు ఈ దర్శకుడు మరి సినిమా పరంగా వస్తే తన తాను ఎంచుకున్న లైన్ ఫస్ట్ హాఫ్ ను హ్యాండిల్ చేసిన విధానం కానీ సింప్లీ సూపర్బ్ అనిపిస్తాయి. కానీ దానిని సెకండాఫ్ లో చూపించకపోవడం చాలా నిరాశ కలిగించే అంశం అని చెప్పక తప్పదు. మరిన్ని ఎమోషన్స్ ఆసక్తిగా అనిపించే కథనం మరింత యాడ్ చేసి ఉంటే బాగున్ను అలాగే క్లైమాక్స్ ను కూడా మరింత అందంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక ఫైనల్ గా చూసుకున్నటైతే ఆఫ్టర్ గ్యాప్ వచ్చిన ఈ “సోలో బ్రతుకే సో బెటర్” ఫస్ట్ హాఫ్ లో అన్ని రకాల ఎలిమెంట్స్ తో నటీ నటుల పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటుంది. వీరు ప్లాన్ చేసిన కామెడీ కూడా థియేటర్స్ లో స్యూర్ షాట్ గా వర్కౌట్ అయ్యింది. కానీ సెకండాఫ్ లో కంటెంట్ డ్రాప్ అవ్వడం అలాగే క్లైమాక్స్ ను ఇంకా బాగా సెట్ చేసి ఉంటే బాగున్ను అనే భావన కలుగుతుంది. జస్ట్ ఈ అంశాలను పక్కన పెడితే ఈ వారాంతానికి మంచి ఎంటెర్టైనర్ గా ఈ చిత్రం నిలుస్తుంది.