36 ప్లస్ వయసులో మూవీ రివ్యూ – 36 Plus Movie Review
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తెలుగు మూవీ 36 వయసులో ఎంచుకోవడం జరిగింది. తెలుగు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ఆహా లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథ :
36ఏళ్ల వసంత తన కుటుంబంతో పాటు ఐర్లాండ్ లో సెటిల్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటుంది. ఓ రోజు అనుకోకుండా భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం ఆమెకు దక్కుతుంది. ఐతే రాష్ట్రపతి కలిసిన ఎక్సయిట్మెంట్ లో ఆమె ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం భర్త, కూతురు వసంతను వదిలివేసి ఐర్లాండ్ వెళ్ళిపోతారు. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వసంత తన స్నేహితురాలు సహాయంతో సక్సెస్ ఫుల్ విమెన్ గా ఎదుగుతుంది. అసలు ఓ సాధారణ గృహిణి అయిన వసంతను రాష్ట్రపతి ఎందుకు కలవాలని అనుకున్నారు. మరి ఆమె ఐర్లాండ్ వెళ్లాలనుకున్న కల ఏమైంది? అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
మంచి నటిగా అనేక చిత్రాలలో తన అధ్బుత నటనతో ఆకట్టుకున్న జ్యోతిక గృహిణి పాత్రలో చాల సహజంగా నటించారు. ఈ చిత్రానికి ఆమె నటన ప్రధాన ఆకర్షణ అనాలి. కామెడీ, ఎమోషన్స్ అండ్ ట్రాజెడీ వంటి అన్ని ఎమోషన్స్ ఆమె తన పాత్రలో చక్కగా పలికించారు.
జ్యోతిక భర్తగా ప్రధాన పాత్ర చేసిన రహ్మాన్ ఆకట్టుకున్నారు. భార్య ఆశలకు అడ్డుపడే భర్త పాత్రలో ఆయన మెప్పించారు. మహిళా సాధికారత అనే అంశాన్ని చెప్పిన విధానం బాగుంది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభమే నెమ్మదిగా మొదలవుతుంది. మొదటి అరగంట సమయం జ్యోతిక పాత్ర రొటీన్ లైఫ్ చూపించడానికి దర్శకుడు కేటాయించాడు. మెయిన్ కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు.
ఇక ఈ మూవీలో దివంగత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ ఛాయలు బాగా కనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సహజంగా లేదు. ఇక జ్యోతిక పాత్రను మోతాదుకు మించి ఎలివేట్ చేశారు, భర్తగా చేసిన రెహ్మాన్ పాత్రను కూడా మరీ నెగెటివ్ యాంగిల్ లో చూపించడం అంతగా రుచించదు.
ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే కథలో ఇంత సంక్లిష్టత ఉన్నప్పుడు అధ్బుతమైన స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే వర్క్ అవుట్ అవుతుంది. ఈ కథను సింపుల్ గా తెరకెక్కించినా కూడా మరింత ఆకర్షణగా ఉండేదన్న భావన కలిగింది.
తీర్పు :
మహిళా సాధికారత అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన 36 వయసులో మూవీ జ్యోతిక మార్కు నటనతో కొంత మేర ఆకట్టుకుంది. సమకాలీన సమాజంలో జరుగుతున్న పాయింట్ ని చర్చించిన విధానం బాగుంది. అయితే ఆకట్టుకోని కథనం, మరియు పతాక సన్నివేశాలు సినిమా ఫలితంపై ప్రభావం చూపాయి. ఐతే లాక్ డౌన్ సమయంలో ఓ సారి చూసి టైం పాస్ చేయవచ్చు.