30 Rojullo Preminchadam Ela 2021 Telugu Movie Review

30 Rojullo

30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా మూవీ రివ్యూ – 30 Rojullo Preminchadam Ela Movie Review

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

కథ :




అర్జున్ (ప్ర‌దీప్) అక్షర (అమృతా అయ్య‌ర్) ఒకే కాలేజీలో చదువుతుంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒక్కరికి అసహ్యం, మొదటి పరిచయంలోనే ఒకర్ని ఒకరు ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు వీరిద్దరూ ఒకర్నిఇష్ట పడటం లేదు, గత జన్మలో వీరి మధ్య జరిగిన కథ ఏమిటి ? దాని కారణంగా ఈ జన్మలో వీరి మధ్య జరిగిన డ్రామా ఏమిటి అనేది మెయిన్ కథ. ఇక చివరకు వీరిద్దరూ మళ్ళీ ఎలా కలిశారు ? ఈ మధ్యలో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు ? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

హీరోగా ప్రదీప్ కి మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. అమ్మను అమ్మాయిలని ఇష్టపడని సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు ప్రదీప్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశంలో గాని ప్రదీప్ చాలా చక్కగా నటించాడు.

‌అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతా అయ్య‌ర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన నటుడు కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన పోసాని కూడా బాగా నటించాడు. ఇక కమెడియన్ భద్రం, హర్ష తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్ :




దర్శకుడు మున్నా ప్రేమకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే ప్రేమ మరియు సంఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.

దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. అయితే సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు, అలాగే సెకండ్ హాఫ్ ;లో అక్క ఎమోషనల్ సీన్ తప్ప మిగిలిన సీన్స్ అన్ని పేలవంగా అన్నీ ఆకట్టుకోవు.

ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే, ఎక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. దర్శకుడు ట్రీట్మెంట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

ముందే చెప్పుకున్నట్టు దర్శకుడు మున్నా మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోలేదు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు చాల బాగున్నాయి. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగాలేదు. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయాల్సింది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్లు ఉన్నాయి.

తీర్పు :

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అంటూ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆసక్తికరంగా సాగలేదు. అయితే దర్శకుడు మున్నా మాత్రం ప్రేమకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలని మాత్రం రాసుకోలేదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే ఇంటర్వెల్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగవు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు.

English Review