18 పేజెస్ మూవీ రివ్యూ – 18 Pages Movie Review
నిఖిల్, అనుపమ హీరోహీరయిన్లుగా నటించిన చిత్రం 18 పేజీస్. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ కథ అందించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) ఒక సాప్ట్ వేర్ ఎంప్లాయ్. ఐతే, ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. అనంతరం ఆ బాధలో సిద్దు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నందిని (అనుపమ పరమేశ్వరన్) ఓ డైరీని చదువుతాడు. సిద్ధు నందని ఆలోచనలకు పూర్తిగా కనెక్ట్ అయిపోతాడు. ఈ మధ్యలో సిద్ధు, నందిని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాడు. పూర్తిగా సిద్దు, నందిని రాసిన 18 పేజెస్ లా మారిపోయాక అతను జీవితం ఎలా టర్న్ అయింది ?, అసలు సిద్దు – నందిని మధ్య ఎలా ప్రేమ పుట్టింది ?, కలుసుకున్న మొదటి కలయికలోనే వీరిద్దరూ గొప్ప ప్రేమికులుగా ఎలా మిగిలారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ డిజిటల్ జనరేషన్ లో కేవలం ఫీలింగ్స్ తో ప్యూర్ లవ్ లో పడటం, పైగా ప్రేమించడానికి కారణం ఉండకూడదు, ఎందుకు ప్రేమంచామో రీజన్స్ వెతుక్కోకూడదు అనే కోణంలో సాగిన ఈ ఫీల్ గుడ్ లవ్ డ్రామాలో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది. అలాగే గుడ్ ఎమోషన్స్ తో పాటు డీసెంట్ లవ్ ట్రీట్మెంట్ కూడా సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి.
దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ సినిమాలో లవర్స్ మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్య ఆలోచనలను, జ్ఞాపకాలను, అనుభవాలను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. సుకుమార్ రాసిన కథలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది.
నటీనటుల నటన విషయానికి వస్తే.. హీరోగా కూడా నటించిన నిఖిల్ తన టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని నిఖిల్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా నటించింది. పోసాని కృష్ణ మురళి, అజయ్, గోపరాజు రమణ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
సుకుమార్ తీసుకున్న కథాంశం, రాసిన కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో బాగా స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి.
దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ ప్రేమ సన్నివేశాలతోనే సినిమాని నడిపాడు. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా ఆకట్టుకోదు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ నవీన్ నూలి అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
♦ ట్రైలర్ : 18 పేజెస్ – నిఖిల్, అనుపమ – 23/12/2022 – 18 Pages Trailer – Nikhil, Anupama
తీర్పు :
18 పేజెస్ అంటూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ డ్రామాలో స్వచ్చమైన ప్రేమ కథ, కొన్ని ప్రేమ సన్నివేశాలు అలాగే ట్రూ ఎమోషన్స్ అండ్ క్లైమాక్స్, మరియు నిఖిల్ – అనుపమ నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల ప్లే స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి మైనస్ అయ్యింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది.