Romantic Criminals 2019 Telugu Movie Review

Romantic

రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌ మూవీ రివ్యూ ఆడియో – Romantic Criminals Movie Review Audio





 

పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌. ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

డ్రగ్స్ వల్ల యువత ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని హైలెట్ చేస్తోంది ఈ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌ చిత్రం. వైజాగ్ లో ఉండే కార్తీక్ – ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ ప్రభావంతో డ్రగ్ మాఫియా సహాయంతో వివిధ నేరాలకు పాల్పడతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వాళ్లు అన్ని నేరాలు ఆపేసి జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మరి వారు సులభంగా ఆ నేర ప్రపంచం నుండి బయటకు రాగలిగారా? ఆ క్రమంలో వాళ్లు ఏ విధమైన హర్డిల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో డ్రగ్స్ కారణంగా విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు అలాగే మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులను అర్ధవంతంగా చూపించడం బాగుంది. డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.

నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా చెప్పాల్సింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అవంతిక నటన గురించి. అవంతిక చాలా బాగా నటించింది. ఇక హీరోగా చేసిన మనోజ్ నందం కూడా తన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా నటించాడు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్ :

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఒక క్రిమినల్ ప్రేమ కథ’ సినిమాలకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చినప్పటికీ.. ఆ సినిమాల్లో ఉన్న ఎమోషనల్ ట్రీట్మెంట్, కామెడీ ఈ సినిమాలో మిస్ అయింది. అయితే యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ సినిమాలో ఉన్నా.. అది సరిగ్గా ఎలివేట్ కాలేదు.

మెయిన్ ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మొత్తానికి దర్శకుడు సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యేలా అడల్ట్ కామెడీని ఇందులో పండించలేకపోయాడు. పాయింట్ బాగున్నా.. బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద ఇంట్రస్ట్ ని కలగకుండా చేశారు.

ముఖ్యంగా హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ సినిమాని బలహీనపరిచాయి. ఇక టేకింగ్ కూడా షార్ట్ ఫిల్మ్ టేకింగ్ తో సాగుతుంది. దాంతో సినిమా పై ఇర్రిటేషన్ కలుగుతుంది. దర్శకుడు స్క్రిప్ట్ తో పాటు టేకింగ్ పై కూడా ఇంకా బాగా దృష్టి పెట్టాల్సింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ గా చేసిన శివ రామ్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తోంది. సుధాకర్ అందించిన సంగీతం పెద్దగా మ్ ఆకట్టుకోదు. ఎడిటర్ వి.నాగిరెడ్డి తన కత్తెరకి ఇంకొంచెం పనిచెప్పి ఉంటే బాగుండేది. దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి తనే స్వయంగా రాసుకున్న ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ఇంకొంచెం పగడ్బందీగా రాసుకోని ఉంటే బాగుండేది. నిర్మాతలు ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజుల నిర్మాణ విలువులు బాగాలేదు.

తీర్పు :

ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఒక క్రిమినల్ ప్రేమ కథ’ సినిమాలకు సీక్వెల్ గా పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం నిరుత్సాహ పరుస్తోంది. విషయం లేని కథలో అనవసరమైన సన్నివేశాలల్లో పండని ఎమోషన్ని సెంటిమెంట్ని రంగరించినప్పటికీ ఈ డ్రగ్ కథ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

Release date : 17 May 2019

Teluguprazalu.com Rating : 2/5

Starring :  Manoj Nandan, Vinod, Avantika, Divya, Mounika

Director :  Sunil Kumar Reddy

Producers :  Y Ravindrababu

Music Director :  Sudhakar Mario

Cinematographer :  SV. Sivaram





Noted director, Sunil Kumar Reddy has come up with yet another crazy film titled Romantic Criminals. The film has hit the screens today. Let’s check how it is.

Story :

Romantic Criminals mainly showcases the effects of drug mafia on today’s college-going youth. Habituated to drugs, a young couple, Karthik and Angel commit various crimes in Vizag with the help of a drug peddler. One fine day, they decide to stop all the crimes and settle down in life. Will they be able to come out of the crime world easily? What kind of hurdles will they face? To know this, you have to watch the film on the silver screen.

Plus Points :

Young artists, Karthik and Avanthika, who played the lead roles in the film are decent and have a good screen presence. Their performance in a few emotional scenes was good. One romantic song featuring them will attract the youth because of the glamor quotient.

The root cause for the explosion of drug mafia in the city and what reasons make children get attracted to drugs is showcased nicely. Other artists like Vinay and Divya are decent in the supporting roles.

Minus Points :

This movie also deals with a good social concept but lacks an engaging narration. This is the biggest drawback as many scenes are not properly executed and look forced.

Too many threads of various people joining the drug mafia get tedious and certain links in the mafia setup are not elaborated properly. Adding to it, the slow paced narration and the unengaging screenplay is an added blunder for the film.

Technical Aspects :

Senior director Sunil Kumar Reddy’s idea of exposing drug mafia is good but he miserably failed in narrating it with some interesting proceedings. If he would have focused on the execution part, the result would have been even better. Editing work is not up to the mark as the film seriously needs a re-edit to avoid unwanted scenes.

The cinematography is bad as the film’s quality is worse than a short film. Music by Sudhakar Mario is just about okay. Production values for this low budget film are adequate.

Verdict :

On the whole, Romantic Criminals is a boring and unconvincing crime drama which does not work in many aspects. Though the film highlights the effect of drugs on today’s youth, it is not narrated in a convincing manner. Except for a few romantic scenes between the lead pair, this film has absolutely nothing new to offer. So, skip the film this weekend and look for better options.