Hippi 2019 Telugu Movie Review

Hippi

హిప్పీ మూవీ రివ్యూ ఆడియో – Hippi Movie Review Audio




 

ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశి, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ -హిప్పీ. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

దేవ్ (కార్తికేయ) స్నేహతో (జజ్బా సింగ్) ఆల్ రెడీ లవ్ లో ఉంటాడు. అయితే స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశి)ను చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. ఇక ఆమెను ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆముక్తమాల్యద దేవ్ ప్రేమను అంగీకరిస్తోంది. అయితే తన చెప్పిన ప్రతి పనిని చెయ్యాలని షరతు పెడుతుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వస్తాయి. వాటి మూలంగా వారి జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? ఈ క్రమంలో వారి మధ్యన ఆనంద్ ( జేడీ చక్రవర్తి) ఎలాంటి పాత్రను పోషించాడు ? ఇంతకీ వాళ్లిద్దరూ మళ్లీ కలిసారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో యూత్ కి నచ్చే అంశాలు ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక హీరోగా నటించిన కార్తికేయ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా కూడా ఆకట్టుకుంటాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో తన డాన్స్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా బాక్సింగ్ సీన్ లో, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ తో గొడవ పడే సీన్ లో, ఆ తరువాత ఇద్దరూ ఒకటయ్యే సీన్ లో కార్తికేయ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన దిగంగన సూర్యవంశి బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

చాలా గ్యాప్ తర్వాత నటించిన జేడీ చక్రవర్తి కూడా ఆనంద్ పాత్రలో ఒదిగిపోయారు. జేడీ చక్రవర్తి చేత చెప్పించిన డైలాగ్స్ కూడా యూత్ ను బాగా అలరిస్తాయి. వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించాడు. మరో హీరోయిన్ జజ్బా సింగ్, బ్రహ్మాజీ హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మెయిన్ పాయింట్ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది.

ఇక లవ్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగించినా.. ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ అండ్ లవ్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. దీనికి తోడు సినిమాలో అక్కడక్కడ బూతులు శృతిమించాయి.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద గొప్పగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే ప్రేమ సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం నాలుగు రొమాంటిక్ సీన్స్ అండ్ సాంగ్స్ నే హైలెట్ గా భావించి సినిమాని నడిపించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు టిఎన్ కృష్ణ కొన్ని ప్రేమ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక ఆర్ డి రాజేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోవాలో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు నివాస్ కె ప్రసన్న అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత కలైపులి ఎస్ థాను పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

టిఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగన సూర్యవంశి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే థీమ్ తో పాటు సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, కార్తికేయ నటన, కొన్ని డైలాగ్ లు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో కథకు అనవసరమైన కామెడీ అండ్ ప్రేమ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, అలాగే స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

Release date : 6 June 2019

Teluguprazalu.com Rating : 2/5

Starring : Kartikeya, Digangana Suryavanshi, J. D. Chakravarthy, Vennela Kishore, Hari Teja

Director : TN Krishna

Producers : S. Thanu

Music Director : Nivas Prasanna

Cinematographer : R. D. Rajasekhar

Editor : K. L. Praveen




RX 100 fame Kartikeya is back with yet another youthful romantic drama, titled Hippi. Directed by TN Krishna, the film is out for public viewing today. Let’s see how it is.

Story :

Hippi Devadas (Kartikeya), who is already in a relationship with a girl named Sneha, falls for her close friend Amuktamalyada (Digangana Suryavanshi) and breaks up with the first girl. After a constant pursuit by Deva, Amuktamalyada finally says yes to his proposal. The actual story begins when they both get into a serious relationship. What sort of insecurities will the young couple face during this course of time? Will they continue their relationship and make it an everlasting one? To know this, you have to catch the film in theaters near you.

Plus Points :

Hero Karthikeya’s makeover as a stylish and trendy youngster is good. He maintained a well-toned physique and surprises with his six-pack abs.

Heroine Digangana Suryavanshi is the show stealer. She impresses with her cute looks. Her screen presence and energetic performance bring depth to the proceedings to an extent.

The chemistry between the lead pair is showcased in a realistic way. The romantic episode between the lead pair during the climax will enthrall the young audience.

It’s good to see JD Chakravarthy on the screen after a brief gap. He is okay in his role. Comedian Vennela Kishore evokes a few laughs with his spontaneous funny dialogues.

Minus Points :

The main drawback of the film is that it lacks a proper flow in the narration. From the first scene itself, you get a feeling of watching yet another typical love story with unbearable narration.

The crucial drama and romance between the lead pair are not established in the right manner, as unnecessary arguments come your way all the time.

In an overview, though the film is a straight Telugu film, somewhere the proceedings make you feel as if you are watching a dubbing film.

Technical Aspects :

Director TN Krishna’s main idea of making a love story set in contemporary times is good. But sadly, he forgot to update his narrative style. Right from the screenplay to the narration, the film is handled in an old fashion and hence the proceedings became predictable.

Editing by Praveen K. L is not up to the mark, as close to twenty minutes of the film can be easily chopped off. Cinematography by R. D. Rajasekhar is just about okay and could have been better. But he nicely captured Goa in two songs.

Music by Nivas K. Prasanna is decent, as two romantic numbers in the first half are good. His background score fails to create magic at the crucial juncture of the film. Production values by top producer Kalaipuli S. Thanu’s V Creations are top notch.

Verdict :

On the whole, Hippi is a stylish romantic film which fails to impress the audience. Hero Karthikeya and heroine Digangana take the lead and make the proceedings appealing, but abrupt narration with double meaning dialogues totally spoil the plot, making it a boring watch this weekend.