Evadu Thakkuva Kaadu 2019 Telugu Movie Review

Evadu

ఎవడు తక్కువకాడు మూవీ రివ్యూ ఆడియో – Evadu Thakkuva Kaadu Movie Review Audio




 

నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ లగడపాటిని ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ‘”ఎవడు తక్కువకాడు” నలుగురు సామాన్య యువకులకు, ఓ బలమైన వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్యపోరు అన్న పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందు కు రానుంది. మరి ఈ ఎలా ఉందో ఇప్పడు చూద్దాం.

కథ :

యుక్తవయసులో ఉన్న నాలుగు ఆనాధలు మధు(విక్రమ్), రాజా, బండా, మరియుచిన్ని మోండా మార్కెట్ లో కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తూ ఉంటారు. వీరితో ఎప్పటినుండో మంచి అనుబంధం ఉన్న పూర్ణక్క వీరి కష్టం చూసి జాలిపడి ఓ హోటల్ పెట్టిస్తుంది. ఓ హోటల్ కి మంచి పేరొచ్చి లాభాలతో వారి జీవితాలు మారనున్నాయన్న తరుణంలో ఆ మార్కెట్ ని శాసించే రాయుడు మరి వాడి గ్యాంగ్ తో సమస్యలు మొదలౌతాయి. దానితో వారి భవిష్యత్ ప్రశ్నర్ధకంలో పడుతుంది. మరి ఆ నలుగురు ఆనాధలు ఎవరి అండా లేకుండా బలవంతుడైన రాయుడిని ఎలా ఎదిరించారు. తమ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

నటనపరంగా మొదటి సినిమాలో పర్వాలేదు అనిపించిన లగడపాటి విక్రమ్ డాన్స్ లు విరదీశాడు. విక్రమ్ స్నేహితులుగా చేసిన ముగ్గురు టీనేజర్స్ తమ పరిధిలో చక్కగా నటించారు. ఈ నలుగురు మిత్రుల మధ్యలో నడిచే కొన్ని సంఘటనలు సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ప్రియాంక జైన్ స్కూల్ గర్ల్ లా చాలా క్యూట్ గా ఉంది. పూర్ణక్క పాత్ర చేసిన మహిళ భావోద్వేగ సన్నివేశాలలో చాలా చక్కగా నటించింది. నలుగురు టీనేజర్స్ టూ పాటు నటించిన మరో టీనేజ్ గర్ల్ పాత్రలో నటించిన అమ్మాయి పర్వాలేదనిపించింది.సినిమాలో అక్కడక్కడా వచ్చే కమెడియన్ రఘు హాస్య సన్నివేశాలు బాగానే నవ్వించాయి. సినిమా చివర్లో టైటిల్స్ పడేటప్పుడు వచ్చే విక్రమ్ స్పెషల్ సాంగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలలతో మూవీ పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్, కథ మోండా మార్కెట్ కి షిఫ్ట్ ఐయ్యాక పట్టుకోల్పోతుంది. ఇంటర్వల్ కి ముందు వచ్చే , ఈ నాలుగు ఆనాధలు కష్టాలు పడే సన్నివేశాలు ఛత్రపతి సినిమాలోని సన్నివేశాల్ని తలపిస్తాయి. అనవసర సన్నివేశాలు కథలో చొప్పించి, ప్రేక్షకుడికి విసుగు కలిగేలా చేశారు. ఒక తరుణంలో సినిమా సిరీయస్ నెస్ కోల్పోయి చిన్నపిల్ల సినిమాలా అనిపిస్తుంది. తమిళ మూవీ కావడంతో దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినా, తమిళ్ ఫ్లేవర్ సినిమాను వదిలిపోలేదు.
టెక్నికల్ విభాగం: కథ కొత్తది కాకపోయినాకూడా దర్శకుడు రఘు జయ స్క్రీన్ ప్లే పై ద్రుష్టి పెట్టాల్సింది. ఈయన సినిమా తీసిన తీరు ఎప్పుడో పాత సినిమా ఫార్మాట్లో ఉంది. ఎడిటింగ్ అనుకున్నంతగా లేదు, సినిమాలో దాదాపు 15 నిమిషాల అనవసర సన్నివేశాలున్నాయి. సినిమాలో కోరియోగ్రఫీ బాగుంది.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే నలుగురు యువకులు అస్తిత్వం కోసం చేసేపోరాటమే “ఎవడు తక్కువకాడు” ఎంచుకున్న పాయింట్ మంచిదైనా దాన్ని ప్రెసెంట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ ఐయ్యారు. రొటీన్ పాత కాలపు సన్నివేశాలు విసిగించేస్తాయి. చూడాలనుకుంటే సాహసమే…!

Release date : 24 May 2019

Teluguprazalu.com Rating :2/5

Starring : Vikram sahidev, Priyanka Jain, Madhusudhan Rao, Raghu Karumanchi, Tara

Director :   Raghu Jaya

Producers : Sridhar Lagadapati, Sirisha Lagadapati

Music Director :  Sai Karthik

Cinematographer :  Dhamu Narravula

Editor : Srikanth Patnaik





Producer Lagagapati Sridhar’s son Vikram Lagadapati is the hero of the movie “evadu Thakkuva Kaadu” Released Today, Let’s see how this is now.

Story :

Teenage orphans, Madhu(Vikram) and his three friends Raja, Banda, and Chinna lead their life by doing odd jobs in Monda market. One fine day, with the help of a lady called Pooranakka, they open a hotel in the market area. When the food business starts progressing, they start facing hurdles from the market head Rayudu and his gang. Rest of the story is how these teenage guys take on Rayudu and safeguard their hotel.

Plus Points :

Vikram Lagadapati is decent with his acting and showcased good ease in the dance moves. All the teenage guys who acted in supporting roles are okay with their acting. A few scenes between the friend’s gang and their lifestyle are projected in a realistic manner.

Heroine Priyanka Jain is cute as a school going, teenager. The lady, who acted in Pooranakka’s role is good with her performance in emotional scenes. Yet another girl in the friend’s gang did an okayish job.

Noted comedian, Adhurs Raghu evokes good laughs at regular intervals in both the halves. A special song shot on Vikram which comes during the end titles is presented in a lavish manner.

Minus Points :

The opening scenes in the film promise an intriguing drama but from thereon, the film shifts to Monda market with same old style narration. The film showcases the rise of teenage guys post the interval block and these scenes remind us of Chatrapathi.

At one point in time, we feel it like watching a childish film as the narration lacks seriousness in it. A few unwanted scenes are forcibly inserted in the film which totally disturbs the flow and makes the audience look at the exit doors.

Technical Aspects :

Director Raghu Jaya’s story has nothing new but he could have concentrated in writing a better screenplay. His taking is completely outdated as most of the time we feel like watching an old film. Editing work is not up to the mark as the film can be chopped off for 15 minutes easily. Cinematography is decent as the rustic favor in the film is brought out in a nice manner.

Music is a big letdown as none of the songs and background score worked. Surprisingly, production values by a big banner like Rama Lakshmi Creations are of low standards.

Verdict :

On the whole, Evadu Thakkuva Kaadu is the story of four orphans and their fight for survival. Though the point looks decent, the narration part is totally unengaging with routine scenes and silly narration making this film a tedious watch this weekend.